Breaking News

అయోధ్య

అయోధ్యపురిలో అద్భుత ఘట్టం

అయోధ్యపురిలో అద్భుత ఘట్టం

అయోధ్య: అయోధ్యపురిలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. యావత్​ భారతదేశం వేయికండ్లతో వేచిచూసిన దృశ్యం కనువిందు చేసింది. దశాబ్దాల పోరాటం ఫలించింది. 130 కోట్ల భారతీయుల కల నెరవేరింది. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి తొలిఅడుగు పడింది. కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా ప్రధాని మోదీ రామాలయ నిర్మాణానికి బుధవారం భూమి పూజచేశారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భూమి పూజకు ముందు ప్రధాని మోదీ హనుమాన్‌గర్హిలో పూజలు నిర్వహించారు. రాంలల్లా విగ్రహాన్ని దర్శించుకుని పూజలు […]

Read More
అయోద్యకు చేరుకున్న మోదీ

అయోధ్యకు చేరుకున్న మోదీ

అయోధ్య: ప్రధాని మోదీ అయోధ్యకు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేకవిమానంలో అయోధ్యకు విచ్చేసిన ప్రధానికి ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్​, పలువురు ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన అయోధ్యలోని హనుమాన్​గడికి చేరుకొని ప్రత్యేకపూజలు చేశారు. రామ్​లాలాలో పారిజాత మొక్కను నాటారు. అనంతరం 12.44 నిమిషాలకు ప్రధాని రామజన్మభూమిలో రామాలయానికి శంకుస్థాపన చేయనున్నారు.

Read More
రాముడి పుట్టిన ముహూర్తంలోనే..

రాముడు పుట్టిన ముహూర్తంలోనే..

అయోధ్య: దేశంలోని హిందువులంతా ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిరం నిర్మాణం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. దీంతో అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సిటీలోని ఆలయాను, సరయూ నదీతీరాన్ని అందంగా తీర్చిదిద్దారు. ప్రధాని మోడీ అయోధ్యలో దాదాపు 3 గంటల పాటు గడపనున్నారు. బుధవారం ఉదయం స్పెషల్‌ ఫ్లైట్‌లో ఢిల్లీ నుంచి లక్నో చేరుకుంటారు. అక్కడ నుంచి స్పెషల్‌ చాపర్‌‌లో అయోధ్యకు వెళ్తారు. ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని సరయూ నది తీరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన […]

Read More
రాముడు అందరివాడు

రాముడు అందరివాడు

న్యూఢిల్లీ: అయోధ్య రామమందిరం భూమి పూజ నేపథ్యంలో కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ ట్వీట్‌ చేశారు. రాముడు అందరివాడని ఆమె పేర్కొన్నారు. అయోధ్యలో జరిగే ఈ కార్యక్రమంతో దేశమంతా ఒకటవుతుందని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పారు. ‘రాముడు అనే పదానికి అర్థం సరళత, ధైర్యం, నిగ్రహం, త్యాగం, నిబద్ధత, దీనబంధుడు. రాముడో అందరితో ఉన్నాడు. రాముడు, సీతాదేవి సందేశంతో, రామ్‌లాల ఆలయ భూమి పూజ సమాజంలో ఐక్యత, సోదరభావం కలగజేయాలని కోరుకుంటున్నాను’ అని ప్రియాంకగాంధీ ట్వీట్‌ చేశారు. అయోధ్యలో […]

Read More
మరికొద్ది గంటల్లో అయోధ్యలో మహాఘట్టం

మరికొద్ది గంటల్లో అయోధ్యలో మహాఘట్టం

న్యూఢిల్లీ: అయోధ్య మహాఘట్టానికి వేళయింది. ఆలయ నిర్మాణానికి బుధవారం మధ్యాహ్నం ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. శ్రీరాముడి జన్మభూమి అయోధ్యలో బృహత్తర రామాలయం నిర్మాణానికి మరికొన్ని గంటల్లో భూమిపూజ మహోత్సవం జరగనుంది. ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా గర్భగుడిలో 40 కిలోల వెండి ఇటుకలను ప్రతిష్ఠించి..నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సంఘ్‌ అధినేత మోహన్‌ భగవత్‌ తదితరులు రానున్నారు. బీజేపీ అగ్రనేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కార్యక్రమంలో పాల్గొంటారు.ఇదీ చరిత్రసరయూనది ఒడ్డున […]

Read More
అయోధ్యకు.. ముస్లింకే మొదటి ఆహ్వానం

అయోధ్యకు.. ముస్లింకే మొదటి ఆహ్వానం

న్యూఢిల్లీ: అయోధ్య రామమందిర నిర్మాణం భూమి పూజకు రావాలని బాబ్రీమసీదు కోసం న్యాయపోరాటం చేసిన ఇక్బాల్ అన్సారీకి సోమవారం తొలి ఆహ్వానపత్రిక అందింది. అయోధ్య రామజన్మభూమి వివాదంపై ముస్లింల తరఫున బలంగా గళం వినిపించిన వారిలో అన్సారీ ఒకరు. తనను ఆహ్వానించడంపై అన్సారీ హర్షం వ్యక్తంచేశారు. ‘నాకు తొలి ఆహ్వానం అందాలన్నది సాక్షాత్తూ శ్రీరాముడి ఆకాంక్ష అని భావిస్తున్నాను. అందుకే దీన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను..’ అని అన్సారీ అన్నారు.180 మందికి మాత్రమే ఆహ్వానంఈనెల 5న ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో […]

Read More
రాజ్​ థాక్రే

కరోనా విపత్తు వేళ.. అయోధ్యలో వేడుకలా

ముంబై: ఓ వైపు కరోనా మహమ్మారితో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతుంటే.. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ చేయడం అవసరమా? అంటూ నవనిర్మాణ సేన అధినేత రాజ్​థాక్రే వ్యాఖ్యానించారు. శుక్రవారం ముంబైలోని ఓ ప్రాంతీయ ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రజలు పండగలు, ఉత్సవాలు చేసుకొనే మూడ్​లో లేరని వ్యాఖ్యానించారు. కరోనా కేసులు పూర్తిగా తగ్గాక అయోధ్యలో భూమిపూజ చేస్తే ప్రజలు ఈ వేడుకలో ఉత్సాహంగా పాలుపంచుకొనేవారని చెప్పారు.

Read More
అయోధ్యపై గట్టినిఘా

అయోధ్యపై గట్టి నిఘా

లఖ్‌నవూ: ఆగస్టు 5న అయోధ్యలో జరగబోయే రామ మందిర నిర్మాణానికి భూమిపూజ వేడుకను భగ్నం చేయడంతో పాటు విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ కుట్ర పన్నుతోందని కేంద్రనిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో దీంతో అయోధ్య, ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ముమ్మర తనిఖీలు చేపడుతున్నాయి. నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో అయోధ్యలో హై అలర్ట్‌ ప్రకటించారు. అయోధ్యలో భూమిపూజ నిర్వహించే రోజు, జమ్మూకశ్మీర్‌ ఆర్టికల్‌ 370ను రద్దుచేసిన రోజు ఆగస్టు 5 కావడంతో భద్రతా […]

Read More