సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల జిల్లా: రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు అమరవాయి గ్రామంలో మాజీ ఎంపీపీ జయమ్మ ప్రకాష్ గౌడ్ నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలుచేయలేదని మండిపడ్డారు. ఈరోజు తెలంగాణ నీళ్లను ఆంధ్రప్రదేశ్ ఎత్తుకుపోతుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తుంగభద్ర నదికి […]