సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలో సోమవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి దబ్బకట్ల లక్ష్మయ్య తెలిపారు. కరోనా సమయంలో కూడా పండుగను ఐక్యంగా జరుపుకోవడం శుభపరిణామమని అన్నారు. మండలంలో వాజేడు, పేనుగోల్ కాలనీ, మండపాక, గణపురం, గుమ్మడిదొడ్డి, చీపురుపల్లి, చెరుకూరు, పేరూరు, కృష్ణాపురం, కొంగాల, ముత్తారం, శ్రీరామ్ నగర్ గ్రామాల్లో జెండాలు ఎగరవేశామని తెలిపారు. ఆదివాసి అమరవీరుల త్యాగాలు, పోరాట ఫలితంగా ప్రపంచంలోని […]