పన్నెండో శతాబ్దంలో కర్ణాటక రాష్ట్రంలో జన్మించిన బసవేశ్వరుడు విశ్వగురువుగా పేరొందారు. కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలోని బాగేవారి వీరి జన్మస్థలం. బసవేశ్వరుడు 1134 లో వైశాఖ శుద్ధ తదియ రోజున(అక్షయ తృతీయ) అనగా సరిగ్గా 880 ఏళ్లం క్రితం జన్మించారు. తల్లి మాదాంబ, తండ్రి మాదిరాజు ద్వారా చిన్న వయసులోనే బసవేశ్వరుడు శైవపురాణ గాథలను అవగతం చేసుకున్నారు. కుల, వర్ణ, లింగ వివక్షలు లేని సమసమాజ స్థాపనకు ఆనాడే అపారమైన కృషిచేసిన సంఘసంస్కర్త. సనాతన సంప్రదాయ ఆచరణలో నెలకొన్న […]
సారథి న్యూస్, నర్సాపూర్: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్న భ్రమరాంబిక సమేత మల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం మహాన్యాస పూజలు నిర్వహించారు. అక్షయ తృతీయ సందర్భంగా ఏకాదశ రుద్రాభిషేక సహిత అష్టోత్తర శత(108) కలశాలతో అభిషేకం నిర్వహించారు. గంటంబొట్ల రాజేశ్వరశర్మ ఆధ్వర్యంలో ఉమాశంకర్ శర్మ, మురళిశర్మ, రవిప్రసాద్ శర్మ , సుహాస్, వృశిష్ పాల్గొన్నారు.
అక్షయ తృతీయ వచ్చేసింది.. లాక్ డౌన్ నేపథ్యంలో కొనుగోళ్లకు బ్రేక్ ఇప్పటికే ఆరోగ్య, ఆర్థిక రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న కరోనా తాజాగా భారతీయుల సెంటిమెంటుపైనా ఎఫెక్ట్ చూపిస్తోంది. అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు చేసే సెంటిమెంట్‌ను భారతీయులు పెద్ద ఎత్తున పాటిస్తారు. తాజా లాక్ డౌన్, ఫిజికల్ డిస్టెన్స్ వంటి నిబంధనలు, పరిమితుల నేపథ్యంలో అక్షయ తృతీయ సెంటిమెంట్ కొనసాగించడం కష్టంగా మారింది. లాక్ డౌన్ ఎఫెక్ట్కరోనా వ్యాప్తితో మార్చి 25 నుంచి ఏప్రిల్ […]