చంఢీఘర్: పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆ రాష్ట్రంలోని 11,12 వ తరగతి విద్యార్థినులకు బంపర్ఆఫర్ ప్రకటించారు. ఆన్లైన్ క్లాసులు వినేందుకు విద్యార్థినులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేయనున్నారు. మొదటి విడత పంపిణీకి 50 వేల స్మార్ట్ ఫోన్లు సిద్ధంగా ఉన్నాయని సీఎం తెలిపారు. స్మార్ట్ ఫోన్ల పంపిణీకి చైనాకు చెందిన ఓ కంపెనీతో పంజాబ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం నిర్ణయం పట్ల ఆ రాష్ట్రంలోని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం […]
న్యూఢిల్లీ: పార్టీలో తనకు సముచిత స్థానం కల్పించలేదంటూ సొంతపార్టీ కాంగ్రెస్ పైనే తిరుగుబాటు చేసిన రాజస్థాన్ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలెట్ సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో భేటీ అయ్యేందుకు నిరాకరించారంట. తనను ఏడాదిలోపు సీఎం చేయాలని ఆయన డిమాండ్ చేశారని, హామీ ఇచ్చే వరకు తాను భేటీ అయ్యేది లేదని తేల్చి చెప్పారని ప్రియాంకగాంధీకి సన్నిహితుల్లో ఒకరు చెప్పారు. తనను సీఎంను చేస్తానని పబ్లిక్‌గా అనౌన్స్ చేయాలని పైలెట్ కోరారని అన్నారు. డిప్యూటీ సీఎం పదవి నుంచి […]
జులై 10న సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న ‘రోరి’ సినిమాలోని లుక్ రిలీజ్ చేశారు టీమ్ సభ్యులు. ఏ పాత్రకైనా హుందాతనాన్ని తెచ్చే కోట పొలిటికల్ క్యారెక్టర్స్ ఎన్నో పోషించారు. కానీ సీఎం పాత్రలో ఇప్పటిదాకా నటించలేదు. చరణ్ రోరి నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రోరి’ సినిమాలో ముఖ్యమంత్రి పాత్ర పోషించనున్నారు. శుక్రవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఆర్.రామన్న చౌదరిగా సెన్సిటివ్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నారు […]