Breaking News

రాజమండ్రి

శబరి నది బ్రిడ్జిని ఢీకొని లాంచీ మునక

శబరి నది బ్రిడ్జిని ఢీకొని లాంచీ మునక

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా తూర్పు ఏజెన్సీలో గురువారం సాయంత్రం ఘోరప్రమాదం చోటుచేసుకుంది. చింతూరు సమీపంలోని శబరి నది బ్రిడ్జిని ఢీకొని లాంచీ‌ నీటిలో మునిగిపోయింది. కల్లేరు వరద బాధితులకు నిత్యావసర వస్తువులను అందించేందుకు వెళ్తున్న క్రమంలో ఈ అపశ్రుతి చోటుచేసుకుంది.లాంచీ సిబ్బంది రాంబాబు, సత్తిబాబు, పెంటయ్య నీటిలో మునిగిపోయారు. అక్కడే ఉన్న మరో లాంచీ సిబ్బంది ఇద్దరినీ రక్షించారు. వీరిలో పెంటయ్య కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. గోదావరి లాంచీ సిబ్బంది మాత్రమే ఉండడంతో ఘోర ప్రమాదం తప్పినట్లయింది.

Read More
265 మంది ఖైదీలకు కరోనా

265 మంది ఖైదీలకు కరోనా

రాజమండ్రి : రాజమండ్రి సెంట్రల్​ జైల్​లో 265మంది ఖైదీలకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. వారితో పాటు 24మంది జైలు సిబ్బంది కోవిడ్​ బారినపడ్డారు. ఆగస్టు 3న 900మంది ఖైదీలకు నిర్వహించిన పరీక్షల్లో ఒకేరోజు 247మందికి కరోనా ప్రబలినట్లు సంబంధిత వర్గాల ద్వారా తేలింది. కోవిడ్​ ఆస్పత్రుల్లో భద్రతా ఏర్పాట్లు చేయలేక ఖైదీలకు జైలులోనే ఉంచి పోలీసు సిబ్బంది చికిత్స అందజేస్తున్నారు. జైలులో మొత్తం 1675 మంది ఉంటే 265 మందికి ఈ కరోనా వైరస్​ సోకడంతో […]

Read More