సామాజిక సారథి, నడికూడ : రాష్ర్ట ప్రభుత్వం పంట నష్టం జరిగితే రైతులను ఆదుకోవాలని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. శుక్రవారం హన్మకొండ జిల్లా నడికూడలో వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను పరకాల మండలాల్లోని పలు గ్రామాలలో రైతులతో కలిసి దెబ్బతిన్న మిర్చి పంటలు మొక్కజొన్న పంటలను పరిశీలించారు. అనంతరం పరకాల మండలం మలక్కపేటలో రైతులను పరామర్శించి మాట్లాడారు. ప్రకృతి సృష్టించిన ఈ బీభత్సానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి రైతులను ఆదుకోవాలని, వెంటనే పంట నష్టం అంచనా వేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు, మండలాల నాయకులు, కార్యకర్తలు, పలు గ్రామాల రైతులు, తదితరులు పాల్గొన్నారు
- January 15, 2022
- Archive
- Top News
- లోకల్ న్యూస్
- BJP
- Ethela
- Farmers
- huzurabad
- LEADER
- MLA
- Rajender
- should be supported
- ఆదుకోవాలి
- ఈటెల
- ఎమ్మెల్యే
- బీజేపీ
- రాజేందర్
- రైతులను
- లీడర్
- హుజురాబాద్
- Comments Off on రైతులను ఆదుకోవాలి: ఈటెల