Breaking News

కరీంనగర్

జీవాలకు నట్టల మందులు పంపిణీ

జీవాలకు నట్టల మందులు అందజేత

సామాజిక సారథి, చొప్పదండి: కరీంనగర్ ​జిల్లా చొప్పదండి మండలం చాకుంట గ్రామంలో జీవాలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. కురుమ సంఘం అధ్యక్షుడు ఏముండ్ల రాయుడు, బీరయ్య కాపరులకు అందజేశారు. కార్యక్రమంలో కేవైసీఎస్ ​రాష్ట్ర కార్యదర్శి పెద్ది వీరేశం, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్, కురుమ సంఘం నాయకులు ఏముండ్ల రాజయ్య, ఓరుగుల తిరుపతి, రవి, కొమురెల్లి, నాగరాజు, వెంకటయ్య పాల్గొన్నారు.

Read More
విద్యారంగ సమస్యలపై అలుపెరుగని పోరు

విద్యారంగ సమస్యలపై అలుపెరుగని పోరు

సారథి, రామడుగు: దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఏఐఎస్ఎఫ్​ కీలక భూమిక పోషించిందని జిల్లా అధ్యక్షుడు మచ్చ రమేష్ ​గుర్తుచేశారు. గురువారం ఏఐఎస్ఎఫ్ 86వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏఐఎస్ఎఫ్ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చదువు, పోరాడు అనే నినాదంతో ఉద్యమిస్తున్న ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ మాత్రమేనని అన్నారు. భగత్ సింగ్ లాంటి దేశభక్తులను ఆదర్శంగా తీసుకొని శాస్త్రీయ విద్యావిధానం, కామన్ స్కూలు విధానం కోసం పోరాటం […]

Read More
రాజన్నసన్నిధిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

రాజన్నసన్నిధిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

సారథి, వేములవాడ: రాష్ట్రంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. కోడె మొక్కులు చెల్లించుకున్న అనంతరం స్వామివారిని మంత్రి దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయ ఈవో, అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. మహామండపంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఆలయ ఈవో కృష్ణప్రసాద్ చిత్రపటం, ప్రసాదం అందజేసి సత్కరించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, కలెక్టర్ కృష్ణభాస్కర్ తదితరులు ఉన్నారు. వసతిగృహాల ప్రారంభంవేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నూతనంగా […]

Read More
రాష్ట్రవ్యాప్తంగా ‘దళితబంధు’ అమలుచేయాలి

రాష్ట్రవ్యాప్తంగా ‘దళితబంధు’ అమలు చేయాలి

సారథి, వేములవాడ: రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్​ చేస్తూ వేములవాడ పట్టణంలోని సినారె కళామందిరం, తెలంగాణ చౌక్ వద్ద షెడ్యూల్ కులాల సమగ్ర అభివృద్ధి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. హుజూరాబాద్ లో రాష్ట్రప్రభుత్వం దళితబంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలుచేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా అమలుచేసి ప్రతి దళిత కుటుంబానికి ఈనెల 30వ తేదీలోపు రూ.1​0లక్షలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, దళితులకు మూడెకరాల భూమి […]

Read More
పూసల కులానికి ప్రాధాన్యం ఇవ్వాలి

పూసల కులానికి ప్రాధాన్యం ఇవ్వాలి

సారథి, వేములవాడ: పూసల మహిళా సంఘం సమావేశం బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సాయినగర్ లో నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు ముద్రకోల ఆంజనేయులు మాట్లాడుతూ.. పూసల కులానికి ప్రత్యేకంగా గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కోరారు. సంఘానికి భవనం నిర్మించాలని, ఎక్స్ గ్రేషియా రూ.10లక్షలు, పింఛన్లు ఇవ్వాలని, డబుల్​బెడ్​రూం ఇండ్లు ఇవ్వాలని కోరారు. సమావేశంలో జిల్లా కమిటీ చైర్మన్​ముద్రకోల దుర్గేశం, జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్రకోల వెంకటేశం, జిల్లా […]

Read More
ఆస్పత్రికి ‘సంజయ్ సురక్ష’ వైద్యపరికరాలు పంపిణీ

ఆస్పత్రికి ‘సంజయ్ సురక్ష’ వైద్యపరికరాలు పంపిణీ

సారథి, చొప్పదండి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ ​పరిధిలోని ఏడు నియోజకవర్గ కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులకు సంజయ్ సురక్ష అనే పేరుతో వైద్యపరికరాలను బుధవారం ఆ పార్టీ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ కరీంనగర్​ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎవరికీ ఏ సహాయం కావాలన్నా బండి సంజయ్ ముందుంటున్నారని కొనియాడారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఝాన్సీ మాట్లాడుతూ హాస్పిటల్ కు […]

Read More
రాష్ట్రవ్యాప్తంగా ‘దళితబంధు’ అమలుచేయాలి

రాష్ట్రవ్యాప్తంగా ‘దళితబంధు’ అమలుచేయాలి

సారథి, చొప్పదండి: చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కు నియోజకవర్గ దళితులపై చిత్తశుద్ధి, గౌరవం ఉంటే వెంటనే రాజీనామా చేయాలని, దళితబంధు పథకాన్ని ఇక్కడ కూడా అమలుచేసేలా రాష్ట్రం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కాంగ్రెస్​ ఎస్సీసెల్​ చొప్పదండి పట్టణాధ్యక్షుడు కనుమల్ల రాజశేఖర్ అన్నారు. బుధవారం ఆయన చొప్పదండిలో విలేకరులతో మాట్లాడారు. ఈ పథకం పైలెట్ ప్రాజెక్టు కింద కేవలం హుజూరాబాద్ లో మాత్రమే అమలు చేస్తామని చెప్పడం, రాష్ట్రంలోని మిగిలిన నియోజకవర్గాల్లోని దళితులందరినీ ప్రభుత్వం నిరాశకు గురిచేసిందన్నారు. […]

Read More
ఈటల త్వరగా కోలుకోవాలి

ఈటల త్వరగా కోలుకోవాలి

సారథి, రామడుగు: మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని ఆ పార్టీ రామడుగు మండల నాయకులు స్థానిక హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈటల త్వరగా కోలుకుని మళ్లీ హుజూరాబాద్ పాదయాత్ర పూర్తిచేయాలని ఆకాంక్షించారు. నాయకులు కట్ట రవీందర్, జేట్టవెని అంజిబాబు, మునిగంటి శ్రీనివాస్, డబులకార్ రాజు, నిరంజన్ ముదిరాజ్, జిట్టవేని రాజు, నీలం దేవకిషన్, ఉత్తేమ్ రాజమల్లు పాల్గొన్నారు.

Read More