Breaking News

జాతీయం

దేశంలో భారీగా పెరుగుతున్న కేసులు

52 వేల కొత్తకేసులు

న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 52,123 కొత్తకేసులు నమోదయ్యాయి. కాగా 64.4 శాతం రికవరీ రేటు ఉన్నదని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. ఇప్పటివరకు 10,20,582 మంది కరోనా నుంచి కోలుకోగా.. కేవలం గత 24 గంటల్లోనే 32,553 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు ఈ మహమ్మారి 34, 968 మంది పొట్టనబెట్టుకున్నది. 5,28,242 యాక్టివ్​ కేసులున్నాయి.

Read More

ఉద్దవ్​ థాక్రేను ఆహ్వానించలేదు

  • July 29, 2020
  • Comments Off on ఉద్దవ్​ థాక్రేను ఆహ్వానించలేదు

అయోధ్య(ఉత్తరప్రదేశ్): అయోధ్యలోని రామాలయం భూమి పూజ కార్యక్రమానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మినహా ముఖ్యమంత్రులు ఎవరికీ ఆహ్వానం లేదని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తాజాగా ప్రకటించింది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను భూమి పూజ కార్యక్రమానికి ఆహ్వానించలేదని విశ్వహిందూ పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ చెప్పారు. రామాలయం నిర్మాణం కోసం పోరాడిన కీలకవ్యక్తులైన లాల్​ కృష్ణ అద్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, వినయ్ కటియార్, సాథ్వీ రితంబర, మాజీ సీఎం కల్యాణ్ […]

Read More
విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు తెరవద్దు​

విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు తెరవద్దు

రాత్రిపూట కర్ఫ్యూ ఉండదు కేంద్ర హోంశాఖ అన్​లాక్​3.0 మార్గదర్శకాలు న్యూఢిల్లీ: అన్​లాక్​3.0 మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ బుధవారం విడుదల చేసింది. జూలై 31తో అన్‌లాక్‌ 2.0 గడువు ముగియనుండడంతో.. కేంద్రప్రభుత్వం తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. సినిమా హాళ్లు, వినోద పార్కులు, బార్లు మూసివేయాలని సూచించింది. స్విమ్మింగ్ పూల్స్, యోగా సెంటర్లు, జిమ్​లకు కేంద్రం అనుమతిచ్చింది. విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లను మూసివేయాలని సూచించింది. రాత్రిపూట కర్ఫ్యూను ఎత్తివేసింది. ఎట్‌ హోం కార్యక్రమాలపై రాష్ట్రపతి, గవర్నర్లు నిర్ణయం తీసుకుంటారని […]

Read More

వోడ్కా తీసుకోండి.. కరోనాను జయించండి

కరోనా విపత్తువేళ రాజకీయనాయకులు నోటికొచ్చినట్టు ప్రకటించడం చూస్తూనే ఉన్నాం. తాజాగా బెలారస్​ దేశ అధ్యక్షుడు అలెగ్జాండర్​ లుకాషెంకో ఓ సంచలన ప్రకటన చేశాడు. ప్రతి ఒక్కరూ రోజూ 50 ఎంఎల్​ వోడ్కా తీసుకుంటే కరోనా మన గొంతులోనే చనిపోతుందంటూ ఆయన వ్యాఖ్యానించారు. అతడి సూచనపై సోషల్​మీడియాలో ఓ రేంజ్​లో ట్రోలింగ్ నడుస్తోంది. తనకు కరోనా సోకిందని.. తాను రోజు వోడ్కా తాగి కరోనాను జయించానని ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్ ను నిర్మూలించాలంటే వోడ్కాకు మించిన డ్రగ్ […]

Read More
భారత్​ అమ్ములపొదికి రఫెల్​

భారత్​ అమ్ములపొదికి రఫెల్​

న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక రఫెల్​ యుద్ధవిమానాలు భారత్​కు వచ్చేశాయి. బుధవారం మధ్యాహ్నం అంబాలా ఎయిర్​బేస్​కు చేరుకున్నాయి. అబుదాబీ అల్​ద ఫ్రా సైనిక స్థావరం నుంచి ఇవి బయలుదేరాయి. తొలివిడతగా ఐదు యుద్ధవిమానాలు వచ్చాయి. వీటిలో మూడు యుద్ధ విమానాలు కాగా, రెండు శిక్షణ విమానాలు ఉన్నాయి. ఈ యుద్ధ విమానాలు 50వేల అడుగుల ఎత్తుకు ఎగరగలవు. అణ్వాయుధాలను సైతం తీసుకెళ్లే సామర్థ్యం ఉంది. ఫ్రాన్స్​, ఈజిప్ట్​, ఖతార్​ దేశాల వద్ద మాత్రమే ఉన్న ఈ ఫ్లైట్​ ఉన్నాయి. ప్రస్తుతం […]

Read More
5+3+3+4

5+3+3+4

జాతీయ విద్యావిధానానికి కొత్త హంగులు వృత్తి, ఉపాధి లభించేలా నూతన వ్యవస్థ కేంద్రం మానవ వనరుల శాఖ.. ఇక విద్యామంత్రిత్వ శాఖగా మార్పు ప్రధాని మోడీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ ​కీలక నిర్ణయాలు న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్రం మానవ వనరుల శాఖ పేరును విద్యా మంత్రిత్వశాఖగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు నూతన జాతీయ విద్యా విధానానికి కేబినెట్ […]

Read More
అయోధ్యపై గట్టినిఘా

అయోధ్యపై గట్టి నిఘా

లఖ్‌నవూ: ఆగస్టు 5న అయోధ్యలో జరగబోయే రామ మందిర నిర్మాణానికి భూమిపూజ వేడుకను భగ్నం చేయడంతో పాటు విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ కుట్ర పన్నుతోందని కేంద్రనిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో దీంతో అయోధ్య, ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ముమ్మర తనిఖీలు చేపడుతున్నాయి. నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో అయోధ్యలో హై అలర్ట్‌ ప్రకటించారు. అయోధ్యలో భూమిపూజ నిర్వహించే రోజు, జమ్మూకశ్మీర్‌ ఆర్టికల్‌ 370ను రద్దుచేసిన రోజు ఆగస్టు 5 కావడంతో భద్రతా […]

Read More
పార్లమెంట్ భవనాన్ని కూల్చేస్తాం : కేంద్రం

పార్లమెంట్ భవనాన్ని కూల్చేస్తాం : కేంద్రం

న్యూఢిల్లీ : ప్రస్తుత పార్లమెంట్ భవనం పురాతనమైందని, దాన్ని కూల్చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టులో ఓ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ప్రస్తుత పార్లమెంట్ భవనం 100 ఏళ్ల పురాతన భవనమని, భద్రతాపరంగా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని కేంద్రం పేర్కొంది. అంతేకాకుండా ఏవైనా తీవ్రమైన అగ్నిప్రమాదాలు సంభవిస్తే కూడా కష్టమేనని ఆ అఫిడవిట్‌లో తెలిపింది. అందుకే ఇదే స్థలంలో నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తామని కేంద్రం తెలిపింది. ‘ఈ భవనాన్ని 1921 […]

Read More