సారథి న్యూస్, వాజేడు: వానాకాలంలో నిల్వ ఉన్న నీటితో అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు శుక్రవారం ములుగు జిల్లా వాజేడు మండలం మూరుమూరు పంచాయతీలో ఫ్రై డే.. డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. నిల్వ ఉన్న నీటిని తొలగించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సర్పంచ్ పూసం నరేష్, హెల్త్ పర్యవేక్షకుడు కోటిరెడ్డి, శేఖర్, కన్యాకుమారి, ఛాయాదేవి, లలిత కుమారి, అంగన్వాడీ టీచర్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా పేరూరు ఆరోగ్య కేంద్రం పరిధిలోని టేకులగూడెంలో డాక్టర్ సీతారామరాజు ఆధ్వర్యంలో శుక్రవారం కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. 61మందికి వైద్యపరీక్షలు చేయగా.. అందరికీ నెగెటివ్ రిపోర్టు వచ్చింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా వ్యాధి నిర్ధారణ టెస్టులు చేస్తున్నామని తెలిపారు. ఫార్మసిస్ట్ యాలం సతీశ్, హెల్త్ అసిస్టెంట్ కె.తిరుపతి రావు, ఎస్ఎన్ఎం జి.రజిత, ఎల్టీకే.అశ్విని, సర్పంచ్ వాసం కృష్ణవేణి, కార్యదర్శి యాలం వినోద పాల్గొన్నారు.
సారథి న్యూస్, వాజేడు(ములుగు): మహిళలు స్వశక్తితో ఎదగాలని సర్వర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ములుగు, భూపాలపల్లి సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ కోరారు. తస్లీమా చిన్నకుమారుడు సుహాన్ పుట్టినరోజు కానుకగా బుధవారం నిరుపేద మహిళ సంగి ఉమకు కుట్టు మిషన్ అందించి దాతృత్వం చాటుకున్నారు. కరోనా సమయంలో ఏదైనా వేడుకలు చేసుకోలేకపోతున్న వారు పేదలకు ఏదైనా దానం చేసి దాతృత్వం చాటుకోవాలని కోరారు. కార్యక్రమంలో సత్యనారాయణ, డాక్టర్సంతోష్, సర్వర్ ఫౌండేషన్ సభ్యులు మామిడిపల్లి రమేష్, చంటి శామ్యూల్, అస్మా, […]
సారథి న్యూస్, కరీమాబాద్(ఖిల్లావరంగల్): పేదింటి ఆడబిడ్డలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అండగా నిలుస్తాయని కార్పొరేటర్ దామోదర్ యాదవ్ అన్నారు. ఆదివారం నగరంలోని 8వ డివిజన్లో 26మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. పేదల అభ్యున్నతి కోసమే సీఎం కేసీఆర్ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రజలంతా సీఎం, తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు బోగి సురేష్, లబ్ధిదారుల కుటుంబాలు పాల్గొన్నాయి.
సారథి న్యూస్, ఖిల్లా వరంగల్: కొత్త రెవెన్యూ చట్టం అసెంబ్లీలో ఆమోదం పొందిన నేపథ్యంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆదేశాల మేరకు ఖిల్లా వరంగల్ చమన్ సెంటర్లో శుక్రవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకుడు దామోదర్ యాదవ్ మాట్లాడుతూ.. బూజుపట్టిన రెవెన్యూ వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి సీఎం కేసీఆర్అహర్నిశలు కృషిచేస్తున్నారని కొనియాడారు. రెవెన్యూ నూతన చట్టం ద్వారా రైతులు, ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయని అన్నారు. కార్యక్రమంలో […]
సారథి న్యూస్, ములుగు: సఖి కేంద్రాలు మహిళలు, బాలికలకు అండగా నిలవాలని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య సూచించారు. మంగళవారం ములుగు జిల్లా కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో సఖి జిల్లా నిర్వహణ కమిటీ, జిల్లా బాలసంరక్షణ సొసైటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గృహహింస, లైంగిక హింసలను ఎదుర్కొనే మహిళలు, బాలికలకు రక్షణ, న్యాయ, వైద్య సహాయాలు అందుతాయని అన్నారు. జిల్లాలో మార్చి 8న సఖి కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లాలో […]
సారథి న్యూస్, ములుగు: కార్యాలయ ఫైళ్లను ఈ-ఆఫీస్ ద్వారానే సమర్పించాలని, మ్యానువల్ ఫైళ్లు పరిశీలించబోమని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.క్రిష్ణ ఆదిత్య అన్నారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఈ-ఆఫీస్ ద్వారా పాలనకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లా అధికారులందరికీ వారి వారి లాగిన్ ఐడీలు ఇచ్చినట్లు వెల్లడించారు. ఆయా శాఖల అధికారులంతా సెక్షన్ల వారీగా కరంట్ ఫైళ్లు, ముగింపు ఫైళ్ల వివరాలు సమర్పించాలన్నారు. కార్యాలయంలో నిర్వహించనున్న ఫైళ్ల వివరాలను స్కాన్ […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఫ్యాన్స్ అంతా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్బర్త్ డే వేడుకలను ఘనంగా జరుపుకోవాలని కలలగన్నారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లూ చేసుకున్నారు. కానీ ఈసారి పుట్టిన రోజు వేడుకల్లో విషాదం నెలకొంది. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కుప్పం మండలం శాంతిపురం వద్ద కటౌట్ కడుతూనే విద్యుత్ షాక్ కు గురై ముగ్గురు స్పాట్లోనే మృత్యువాతపడ్డారు. దాదాపు 25 అడుగుల ఫ్లెక్సీ కడుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే మరణించిన వారిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండడంతో […]