న్యూఢిల్లీ: ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ విరుచుపడుతోంది. వైరస్ తన రూపాంతరాన్ని మార్చుకుంటోంది. ఎంతో మందిని బలితీసుకుంటోంది. ఈ తరుణంలో థర్డ్‌వేవ్ ముప్పు కూడా తప్పదన్న సైంటిస్టులు, వైద్యనిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ప్రతిఒక్కరిలోనూ మరింత భయాందోళన మొదలైంది. విపత్తు ఎలా విరుచుకుపడుతుందోనన్న కలవరం నెలకొంది. దేశంలో కొవిడ్ అంతానికి, కొత్త రకం వైరస్‌లను ఎదుర్కొనేందుకు టీకాలపై పరిశోధనలను పెంచాలని కేంద్రప్రభుత్వ ప్రధాన సాంకేతిక సలహాదారు విజయరాఘవన్ సైతం హెచ్చరించారు. కొత్త స్ట్రెయిన్‌ను ఎదుర్కొనేలా వ్యాక్సిన్ ను అప్ […]
టోర్నీ నిరవధిక వాయిదా సేఫ్ ప్లేస్ లోకి ప్లేయర్స్ బీసీసీఐకి రూ.2వేల కోట్ల నష్టం న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై కరోనా పడగ పడింది. ఫలితంగా ఐపీఎల్ 2021 నిరవధికంగా వాయిదా పడింది. పలువురు ప్లేయర్లకు కొవిడ్–19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులోని బౌలర్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా వైరస్ బారినపడ్డారు. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లోనూ మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. […]
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. కొవిడ్ 19 దెబ్బకు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్, కర్ఫ్యూల వైపు అడుగులు వేస్తున్నాయి. ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపాయి. చాలా మంది ఉపాధి లేక రోడ్డునపడుతున్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో బ్యాంకులు రుణ గ్రహీతలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకోనున్నాయి. లోన్ ఈఎంఐ చెల్లింపుల పట్ల కొంత గడువు ఇచ్చే విషయాన్ని ఆర్బీఐకి ఆయా బ్యాంకులు తెలియజేశాయి. లోన్లు తీసుకున్నవారికి మరో మూడునెలల […]
కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడి న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నియంత్ర నిబంధనలు పాటించాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ కోరారు. జర్నలిస్టులను కూడా ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా గుర్తిస్తున్నామని స్పష్టంచేశారు. ఆయా రాష్ట్రాలు అప్రమత్తత పాటిస్తూ నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. 12 రాష్ట్రాల్లో లక్షకు పైగా క్రీయాశీలక కేసులు ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, అసోం, బీహార్, అరుణాచల్ ప్రదేశ్, తమిళనాడు, […]
యానాం: తూర్పుగోదావరి జిల్లా యానాం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి, ‘నమస్తే యానాం’ పేరుతో రాజకీయ అరంగేట్రం చేసిన గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మాజీ ముఖ్యమంత్రి రంగస్వామిపై సంచలనం విజయం సాధించారు. 20ఏళ్ల రాజకీయ దిగ్గజం ముద్దాడి కృష్ణారావు కంచుకోటను ఒక యువకుడు నెలకూల్చాడు. యానాంలో చరిత్ర సృష్టించాడు. గెలుపు దోబుచులాడినప్పటికీ చివరికి విజయాన్ని సొంతం చేసుకున్నారు. 16 రౌండ్లు తన ఆధిక్యతను చాటుతూ చివరికి 655 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.నాడు తండ్రి.. నేడు తనయుడుశ్రీనివాస్ అశోక్ […]
ఐదేళ్లకోసారి సంప్రదాయ అధికారమార్పిడికి చెక్ రెండోసారి అధికారంలోకి ఎల్ డీఎఫ్ 1980 తర్వాత అధికారపార్టీ విజయం తిరువనంతపురం: గతంలో లేని విధంగా ఈ సారి కేరళ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తంగా సాగాయి. దేవభూమిలో ఎలాగైనా పాగా వేయాలని కాషాయదళం సర్వశక్తులూ ఒడ్డింది. తామే అధికారంలోకి వస్తామని ధీమాతో ఉన్న బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. అలాగే సంప్రదాయ అధికార మార్పిడిలో మళ్లీ తామే అధికారంలోకి వస్తామనుకున్న కాంగ్రెస్ ఆశలు కూడా గల్లంతయ్యాయి. ప్రతి ఐదేళ్లకూ ప్రభుత్వం మారే […]
బెంగాల్ దంగల్ లో దీదీ విజయం ఎత్తులు వేసి.. చిత్తయిన బీజేపీ తమిళనాడులో డీఎంకే జయకేతనం కేరళలో రెండోసారి విజయన్ సర్కారు అసోం, పుదుచ్చేరిని దక్కించుకున్న ఎన్డీఏ న్యూఢిల్లీ: బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ దుమ్ములేపింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేసి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 209 సీట్లను కైవసం చేసుకుంది. దీదీ సారథ్యంలో తీన్ మార్ మోగించింది. ఏకంగా అధికారాన్ని చేపడతామని గొప్పలు చెప్పిన కాషాయదళం మమతా బెనర్జీ ఎత్తుల ముందు బోల్తాపడింది. మార్చి 27 […]
చెపాక్ నుంచి నాడు కరుణానిధి నేడు ఉదయనిధి స్టాలిన్ గెలుపు చెన్నై: డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంకే స్టాలిన్, ఆయన కుమారుడు, నటుడు, పార్టీ యువజన విభాగం నాయకుడు ఉదయనిధి స్టాలిన్ ఘన విజయం సాధించారు. స్టాలిన్ కొళత్తూరు నియోజకవర్గం నుంచి పోటీచేశారు. తన సమీప ప్రత్యర్థి, ఏఐఎడీఎంకే అభ్యర్థిపై భారీ ఆధిక్యతతో గెలిచారు. 234 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 156 స్థానాల్లో డీఎంకే విజయం ఖాయం చేసుకుంది. అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో […]