Breaking News

కర్నూలు

పనులు చేయకపోతే.. బ్లాక్​లిస్టులో పెట్టండి

పనులు చేయకపోతే.. బ్లాక్​లిస్టులో పెట్టండి

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగర పాలకసంస్థ పరిధిలో కొనసాగుతున్న ఇంజినీరింగ్ సంబంధిత అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తిచేయాలని కమిషనర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. పనులు ప్రారంభించని కాంట్రాక్టర్ల పేర్లను బ్లాక్​లిస్టులో పెట్టాలని సూచించారు. అనుమతి పొందిన నిర్మాణ పనుల కోసం సిద్ధంచేసిన ప్రతిపాదనలను అనుసరించి పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఈనెల 20న జరిగే సచివాలయ ఉద్యోగ పరీక్ష కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో ఎస్ఈ సురేంద్రబాబు, ఎంఈ 2 రమణమూర్తి, సూపరింటెండెంట్ ప్రసాద్ గౌడ్, […]

Read More
జగన్ పాలనలో రాష్ట్రం అప్పులపాలు

‘జగన్ పాలనలో రాష్ట్రం అప్పులపాలు’

సారథి న్యూస్​, కర్నూలు: సీఎం వైఎస్ ​జగన్ మోహన్​రెడ్డి పాలనలో రాష్ట్రం అప్పులపాలైందని, ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం పరాకాష్టకు చేరిందని కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ రెడ్డి తులసిరెడ్డి మండిపడ్డారు.బుధవారం డోన్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థికమంత్రిగా అనర్హుడని విమర్శించారు. శక్తికి మించి అప్పులు చేయడం వైఎస్సార్ ​సీపీ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. సీఎం జగన్ మోహన్​రెడ్డి 15నెలల పరిపాలన కాలంలోనే రూ.1.25లక్షల కోట్ల అప్పు అయిందన్నారు. […]

Read More
సెంచరీ కొట్టిన ప్లాస్మాదాతలు

సెంచరీ దాటిన ప్లాస్మాదాతలు

సారథి న్యూస్, కర్నూలు: కరోనా వైరస్‌ తగ్గుముఖం పడుతోందని, ఇందుకు ప్లాస్మాదాత సహకారం ఎంతో ఉందని సెట్కూరు సీఈవో నాగరాజు నాయుడు అన్నారు. వైరస్‌ బారినపడి కోలుకున్న వారికి అవగాహన కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం సక్సెస్ ​అయ్యారని, ప్లాస్మాదాతల సంఖ్య రోజురోజుకు పెరగడమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్లాస్మాదానంతో ఎందరో ప్రాణాలను కాపాడిన వారవుతారని, ధైర్యంగా ముందుకు రావాలని కలెక్టర్‌ జి.వీరపాండియన్‌, జేసీ రవిపట్టాన్‌ శెట్టి ఇచ్చిన పిలుపుతో దాతలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని అన్నారు. కర్నూలు సర్వజన వైద్యశాలలోని […]

Read More
కర్నూలు అభివృద్ధిపై ఫోకస్​

కర్నూలు అభివృద్ధిపై ఫోకస్​

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్​రెడ్డి హామీ ఇచ్చారని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తెలిపారు. మంగళవారం విజయవాడలో ఆయన ముఖ్యమంత్రిని కలిశారు. అనంతరం విలేకరులకు వివరాలు వెల్లడించారు. నగరంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలిపారు. అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. ముఖ్యంగా తాగునీటి సమస్య రాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. నీటి సమస్య తలెత్తకుండా రెండవ సమ్మర్ స్టోరేజీ […]

Read More
జయప్రకాష్ రెడ్డి మృతి తీరని లోటని

జయప్రకాష్ రెడ్డి మృతి తీరని లోటు

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం శిరివెళ్ల వాసి, ప్రముఖ సినీనటుడు జయప్రకాష్ రెడ్డి అకాల మరణం తీరని లోటని జిల్లా మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ జి.వీరపాండియన్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. నంద్యాల టౌన్ హాల్ లో 10రోజుల పాటు ఎంతో విజయవంతంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి నంది నాటకోత్సవాల్లో తూర్పు జయప్రకాష్ రెడ్డి పాల్గొన్నారని గుర్తుచేశారు. తెలుగు నాటక […]

Read More
ఉచిత విద్యుత్​కొనసాగించండి

ఉచిత విద్యుత్​ కొనసాగించండి

సారథి న్యూస్​, కర్నూలు: రైతులకు మీటర్లు లేకుండా ఉచిత విద్యుత్​ను యథావిధిగా కొనసాగించాలని కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అహమ్మద్‌ అలీఖాన్ ప్రభుత్వాన్ని కోరారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిందని గుర్తుచేశారు. విద్యుత్ సంస్థలను ప్రైవేట్ వారికి ధారాదత్తం చేయడం, వ్యవసాయ విద్యుత్ కు మీటర్లు బిగించాలని జీవో తీసుకురావడం బాధాకరమన్నారు. అనంతరం కలెక్టరేట్ లో వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు కె.పెద్దారెడ్డి, కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ […]

Read More
తప్పుచేస్తే ఎవరైనా చర్యలు తప్పవు

తప్పుచేస్తే ఎవరైనా చర్యలు తప్పవు

సారథి న్యూస్, కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో అరాచకాలు, అన్యాయాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, చట్టప్రకారం చర్యలు తప్పవని వైఎస్సార్​సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవైన్ రామయ్య హెచ్చరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగుతోందన్నారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వానికి నష్టం జరిగేలా ప్రవర్తిస్తే ఎంతటి వారిపైనైనా చర్యలు తీసుకోవడానికి వెనకాడేది లేదని పునరుద్ఘాటించారు. ఇటీవల ఆదోని నియోజకవర్గ […]

Read More
అందుబాటు ధరలకే అమ్మండి

అందుబాటు ధరలకే అమ్మండి

సారథి న్యూస్, కర్నూలు: నగరంలోని స్థానిక కూరగాయల మార్కెట్ యార్డు ఆవరణను కర్నూలు ఎమ్మెల్యే హఫిజ్ ఖాన్ సందర్శించారు. విక్రయదారుల బాధలుసాదకాలు తెలుసుకున్నారు. ప్రస్తుత సమయంలో ఎక్కువ ధరలకు అమ్మకుండా సామాన్యులకు అందుబాటులో రేట్లు ఉండేలా అమ్మాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట పలువురు వైఎస్సార్​సీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Read More