Breaking News

కర్నూలు

మధ్యాహ్నం 2 గంటల వరకే వ్యాపారాలు

మధ్యాహ్నం 2 గంటల వరకే వ్యాపారాలు

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు కార్పొరేషన్​ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున వ్యాపారాల నిర్వహణకు ప్రస్తుతం ఉన్న ఆంక్షలు యథాతథంగా అమలవుతాయని కమిషనర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. ప్రస్తుతం నగరంలో మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే దుకాణాల్లో వ్యాపారాల నిర్వహణ సాగుతోందని, ఈ సమయం ఇలాగే ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆన్ లాక్ 4.0 మార్గదర్శకాలు కేవలం నాన్ కంటైన్​మెంట్ ​జోన్లకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టంచేశారు. మెడికల్, అత్యవసర వైద్య సంబంధిత […]

Read More
ఘనంగా వైఎస్సార్​వర్ధంతి

ఘనంగా వైఎస్సార్​ వర్ధంతి

సారథి న్యూస్, కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా బుధవారం కర్నూలు నగరంలో వైఎస్సార్​సీపీ టౌన్​అధ్యక్షుడు రాజా విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అంతకుముందు వైఎస్సార్​విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మద్దూర్ నగర్ లో శరణాలయానికి టీవీ, మంచాలు, ఫ్యాన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, వైఎస్సార్​సీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బీవై రామయ్య, వైఎస్సార్​సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి, రాష్ట్ర సంయుక్త […]

Read More
మహానేతకు పూలాభిషేకం

మహానేతకు పూలాభిషేకం

సారథి న్యూస్, కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్​ రాజశేఖర్​రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి బుధవారం కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్​రెడ్డి, విజయ మనోహరి దంపతులు తన నివాసంలో పూలాభిషేకం చేశారు. వైఎస్సార్​ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాలాభిషేకం చేస్తే పాల కొరత వస్తుందని, పూలతో అభిషేకం నిర్వహించడంతో స్థానికులు ఎస్వీ దంపతులను అభినందించారు. వైఎస్సార్​ పేదవాడి గుండెచప్పుడు తెలిసిన ప్రజానాయకుడని కొనియాడారు. అనంతరం కర్నూలు ఎస్​టీబీసీ కాలేజీలో నిర్వహించిన వైఎస్సార్ […]

Read More
ఘనంగా వైఎస్సార్​వర్ధంతి వేడుకలు

ఘనంగా వైఎస్సార్​ వర్ధంతి వేడుకలు

సారథి న్యూస్, కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్​ వైఎస్​ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి వేడుకలు కర్నూలు నగరంలో బుధవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ మేరకు పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. నగరంలోని బుధవారపేట 15 వార్డులో సమన్వయకర్త మాదారపు కేదార్ నాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని పార్టీ నంద్యాల పార్లమెంట్ ఇన్​చార్జ్​ బి.వై. రామయ్య ప్రారంభించారు. వైఎస్సార్​ సంక్షేమ పథకాలు జనహృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయాయని ఆయన అన్నారు. లక్షలాది మంది […]

Read More
వైఎస్సార్​ఆశయసాధనకు కృషి

వైఎస్సార్ ​ఆశయ సాధనకు కృషి

సారథి న్యూస్, కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్​వైఎస్​ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతిని కాంగ్రెస్​నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు లక్ష్మీనరసింహ యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం నంద్యాల చెక్ పోస్టు దామోదరం సంజీవయ్య సర్కిల్ సమీపంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్​చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్​హయాంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. అప్పటి కాంగ్రెస్​ప్రభుత్వం 104, 108సేవలు, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్​మెంట్​అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లాకు తాగు, సాగునీటిని అందించిన ఘనత […]

Read More
‘బాలశక్తి, బాల కళ్యాణ్ పురస్కార్’కు దరఖాస్తుల ఆహ్వానం

‘బాలశక్తి, బాల కళ్యాణ్ పురస్కార్’కు దరఖాస్తుల ఆహ్వానం

సారథి న్యూస్, కర్నూలు: 2021వ సంవత్సరానికి గాను జాతీయ స్థాయిలో అందిస్తున్న ‘బాలశక్తి, బాలకళ్యాణ్ పురస్కార్’ అవార్డులు పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కర్నూలు జిల్లా స్త్రీ శిశు అభివృద్ధి సంస్థ పథక సంచాలకులు(ఐసీడీఎస్) శారద భాగ్యరేఖ తెలిపారు. వివిధ రంగాల్లో విశేష ప్రతిభచూపిన బాలలకు ‘బాలశక్తి పురస్కార్’ అవార్డు, బాలలపై పనిచేసే స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులకు ‘బాల కళ్యాణ్ పురస్కార్’ ఇవ్వనున్నట్లు తెలిపారు. జాతీయస్థాయిలో ఎంపికైన వారికి రిపబ్లిక్​డే సందర్భంగా రాష్ట్రపతి, ప్రధానమంత్రి ద్వారా అవార్డుతో పాటు […]

Read More
‘చంద్రబాబు దళితులకు చేసిందేమీ లేదు’

‘చంద్రబాబు దళితులకు చేసిందేమీ లేదు’

సారథి న్యూస్​, కర్నూలు: వచ్చే ఎన్నికల్లో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అడ్రస్​ గల్లంతు కావడం ఖాయమని వైఎస్సార్ ​సీపీ నగర సమన్వయకర్త మాదారపు కేదార్ నాథ్ అన్నారు. సోమవారం బాపట్ల ఎంపీ నందిగామ సురేష్, వేమూరు ఎమ్మెల్యే మెరుగు నాగార్జున పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కర్నూలు పాత బస్టాండ్​ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. […]

Read More
ప్లాస్మా దానం చేయండి

ప్లాస్మా దానం చేయండి

సారథి న్యూస్​, కర్నూలు: యావత్‌ ప్రపంచాన్ని క‌రోనా వణికిస్తున్న సంక్షోభ‌ పరిస్థితుల్లో కరోనా మహమ్మారిని జయించిన వారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని కర్నూలు కలెక్టర్ జి. వీరపాండియన్ పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ‘ప్లాస్మా దానం చేయండి.. ప్రాణదాతలు కండి’ పోస్టర్​ను ఆయన ఆవిష్కరించారు. ప్లాస్మాదానం చేసిన దాతలకు ప్రభుత్వం రూ.5వేల పారితోషికం అందిస్తుందన్నారు. జేసీ (సంక్షేమం) సయ్యద్ ఖాజామోహిద్దీన్, కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ పి.చంద్రశేఖర్, […]

Read More