Breaking News

కరీంనగర్

ఆటో యూనియన్ అధ్యక్షుడిగా కుమార్

ఆటో యూనియన్ అధ్యక్షుడిగా కుమార్

సారథి, రామడుగు: రామడుగు మండల కేంద్రంలో శ్రీరామాంజనేయ ఆటో యూనియన్ ను బుధవారం ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా పెసరి కనకరాజు ఎన్నిక కాగా, అధ్యక్షుడిగా రెండవ సారి ఉత్తెం కుమార్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా చందా అనిల్, ప్రధాన కార్యదర్శిగా జంగిలి శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా ఉత్తేం దేవరాజు, కోశాధికారిగా చంటిబాబు, రైటర్ గా అనుపురం మల్లేశం, సలహాదారుగా కర్నె శ్రీను, పంజాల శ్రీనివాస్, కార్యవర్గసభ్యులుగా ఉత్తెం మల్లేశం, ఉత్తెం సాగర్, గాదం మహేష్, మామిడి రాజు, బుత్కురి […]

Read More
‘దళితబంధు’ పేరుతో కొత్తనాటకం

‘దళితబంధు’ పేరుతో కొత్తనాటకం

సారథి, చొప్పదండి: టీఆర్ఎస్ ​ప్రభుత్వం దళితులను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటూ.. వారిని వంచనకు గురిచేస్తూ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ చొప్పదండి నియోజకవర్గ ఇన్​చార్జ్​ మేడిపల్లి సత్యం విమర్శించారు. మంగళవారం చొప్పదండి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. హుజూరాబాద్ ఉపఎన్నికల నేపథ్యంలో దళితబంధు అంటూ మరో కొత్త నాటకానికి తెరదీశారని అన్నారు. అన్ని నియోజకవర్గాల్లో దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని, లేకపోతే దళితులంతా […]

Read More
విద్యార్థులు అన్నిరంగాల్లోనూ ముందుండాలి

విద్యార్థులు అన్నిరంగాల్లోనూ రాణించాలి

సారథి, వేములవాడ: వేములవాడ పట్టణంలోని గౌతమ్ మాడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభచాటారు. ఇటీవల గుజరాత్ లోని జామ్ నగర్ లో జరిగిన ట్రెడిషనల్ యూత్ గేమ్స్ అండర్-19 హెవీ వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, కబడ్డీ పోటీల్లో లలిత, విజయ్ బాక్సింగ్ లో గోల్డ్ మెడల్స్ సాధించారు. శివసాయి, గణేశ్ కబడ్డీ పోటీల్లో మంచి ప్రతిభను కనబర్చారు. ఈ సందర్భంగా వారు మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ను కలిశారు. ఆయన ఆ విద్యార్థులకు […]

Read More
రాజన్న సన్నిధిలో ఆర్ఎస్ఎస్ ప్రముఖ్​

రాజన్న సన్నిధిలో ఆర్ఎస్ఎస్ ప్రముఖ్​

సారథి, వేములవాడ: దక్షిణకాశీగా పేరొందిన వేములవాడ పార్వతి రాజరాజేశ్వర స్వామివారి ఆలయాన్ని మంగళవారం రాష్టీయస్వయంసేవక్​సంఘ్ అఖిల భారతీయ గ్రామవికాస్ సహ ప్రముఖ గురురాజాజీ, పద్మారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో ఆలయఅర్చకులు, వేదపండితులు వేదోక్త ఆశీర్వచనం చేశారు. అనంతరం స్వామి వారి అభిషేకం లడ్డూ, తీర్థప్రసాదాలను వారికి అందజేశారు. వారి వెంట రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వహిందు పరిషత్ సహాయ కార్యదర్శి గడప కిషోర్ రావు, భజరంగ్ దళ్ ప్రముఖ్ యశ్వంత్ ఉన్నారు.

Read More
టో యూనియన్ కార్యవర్గానికి సన్మానం

ఆటో యూనియన్ కార్యవర్గానికి సన్మానం

సారథి, చొప్పదండి: చొప్పదండి ఆటో యూనియన్ అధ్యక్షుడిగా కొలిమికుంట గ్రామానికి చెందిన చొక్కల్ల లక్ష్మణ్​ ఏకగ్రవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా చీకట్ల శంకర్, ప్రధాన కార్యదర్శి ఎండీ జహంగీర్, క్యాషియర్ గా లంక రవిని ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గాన్ని సోమవారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తన క్యాంపు ఆఫీసులో సన్మానించారు. ఆటోడ్రైవర్లు, ఓనర్ల సమస్యలను పరిష్కారిస్తామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ అరెళ్లి చంద్రశేఖర్ గౌడ్, యూనియన్ అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ముఖ్య సలహాదారులుగా పాలురి ప్రసాద్, […]

Read More
నిరుద్యోగ భృతి ప్రకటించాలి

నిరుద్యోగ భృతి ప్రకటించాలి

సారథి, చొప్పదండి: సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే నిరుద్యోగ భృతి ప్రకటించి నిరుద్యోగులను ఆదుకోవాలని యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ముత్యం శంకర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ ​చేశారు. సోమవారం యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు జి.సంపత్, కల్లేపల్లి ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో చొప్పదండి మండల కేంద్రంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఉద్యోగ క్యాలెండర్​ను విడుదల చేయకపోతే […]

Read More
ప్రైవేట్​టీచర్లను ఆదుకోవాలి

ప్రైవేట్​ టీచర్లను ఆదుకోవాలి

సారథి, చొప్పదండి: ప్రైవేట్​ టీచర్లను ఆదుకోవాలని అసోసియేషన్​అధ్యక్షుడు మాచర్ల మహేశ్​ప్రభుత్వాన్ని డిమాండ్​చేశారు. సోమవారం కరీంనగర్​జిల్లా చొప్పదండి ఆకాశ్ పబ్లిక్ స్కూలులో ఆయన విలేకరులతో మాట్లాడారు. కరోనా కారణంగా స్కూళ్లు మూతపడి 18 నెలలు అవుతోందని, ప్రైవేట్​ఉపాధ్యాయులు మానసికంగా కృంగిపోయారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన రూ.2వేల ఆర్థిక సాయం, 25 కేజీల బియ్యం కొంత స్వాంతన కలిగించిందన్నారు. కానీ ప్రభుత్వం మూడునెలలకే ఆ సహాయాన్ని నిలిపివేసిందన్నారు. ప్రీ ప్రైమరీ టీచర్లు, ప్రైమరీ టీచర్లకు జీవనోపాధి లేక వారి బతుకుదెరువు […]

Read More
భారతమాత చిత్రపటం బహూకరణ

భారతమాత చిత్రపటం బహూకరణ

సారథి, రామడుగు: కరీంనగర్ ​జిల్లా రామడుగు మండలం వెలిచాల పంచాయతీకి సోమవారం బీజేపీ నాయకులు భారతమాత చిత్రపటాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకే ఈ చిత్రపటాలను బహూకరిస్తున్నట్లు తెలిపారు. వెలిచాల సర్పంచ్ వీర్ల సరోజ, మాజీ సర్పంచ్ వీర్ల రవీందర్ రావు, బీజేపీ నాయకులు కట్ట రవీందర్, ముడుగంటి శ్రీనివాసాచారి పాల్గొన్నారు.

Read More