సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికల సమరానికి తెలంగాణ రాష్ట్రంలో నేటితో ఎన్నికల ప్రచార గడువు ముగియనుంది. నాలుగో విడతలో భాగంగా సోమవారం తెలంగాణ రాష్ట్రంలోని 17 నియోజకవర్గాలలో పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి నేటి సాయంత్రంతో ప్రచార గడువు ముగుస్తుండటంతో అభ్యర్థులు పోల్ మేనేజ్ మెంట్ పైన దృష్టిపెట్టనున్నారు. దీనికి ఆదివారం ఒక్కరోజు కీలక కావడంతో ఏయే నియోజకవర్గాల్లో ఏ వ్యూహాలను అనుసరించాలి, ఎక్కడెక్కడ తమకు అనుకూలంగా లేని పరిస్థితులను మార్చుకోవాలన్న దానిపై దృష్టిసారించారు. […]