Breaking News

అంబేద్కర్​ జయంతి వేడుకల్లో ఘర్షణ

అంబేద్కర్​ జయంతి వేడుకల్లో ఘర్షణ

బిజినేపల్లి మండలం వెలుగొండలో ఉద్రిక్తత

సామాజికసారథి, బిజినేపల్లి: అంబేద్కర్​ జయంతి వేడుకల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. డీజే పాటలతో ఊరేగింపు నిర్వహిస్తున్న కొందరు దళిత యువకులపై అదే గ్రామానికి చెందిన పలువురు అగ్రకులస్తులు దాడులకు తెగబడ్డారు. ఈ ఘటన ఆదివారం రాత్రి నాగర్​ కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలం వెలుగొండ గ్రామంలో చోటుచేసుకుంది. బాధితులు, స్థానికుల కథనం మేరకు వివరాలు.. భారతరత్న డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​ జయంతి సందర్భంగా గ్రామంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఊరుఊరంతా కదిలివచ్చి ఆ మహనీయుడి సేవలను కొనియాడారు. రాత్రి ఊరేగింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డీజేకు ముందుకు సాగుతున్నారు. ‘మమ్మల్ని ఎవడురా తక్కువ కులపోళ్లు అన్నది’ అనే సాంగ్ కు యువకులంతా డాన్స్​ లు చేస్తున్నారు. ఇంతలో గ్రామానికి చెందిన కొందరు అగ్రకులస్తులు రంగప్రవేశం వేసి డీజేను బంద్​ చేయించారు. ఎందుకు ఆపు చేస్తున్నారని దళిత యువకులు ప్రశ్నించడంతో మాటామాట పెరిగి దాడుల దాకా వెళ్లింది. దీంతో ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో కొందరు దళిత యువకులు గాయపడ్డారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. బిజినేపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డీజే వాహనాన్ని పోలీస్​ స్టేషన్​ కు తీసుకెళ్లారు.