సామాజిక సారథి, వనపర్తి బ్యూరో: వనపర్తి జిల్లాలో ఎలాంటి అడ్డంకులు లేకుండా యథేచ్చగా జరుగుతున్న బోగస్ బోనఫైడ్ ల దందా పై ఈ నెల 20న సామాజిక సారథి పత్రికలో ప్రచురించిన కథనం సంచలనంగా మారింది. నిరుపేద తల్లిదండ్రుల అమాయకత్వాన్ని కొందరు గురుకుల కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్న విషయం ఈ కథనంలో వివరంగ రావడంతో ఆయా కోచింగ్ సెంటర్ల నిర్వహకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. పైసలిస్తే చాలు… స్టూడెంట్ల పుట్టిన తేదిలతో పాటు అడ్రస్ […]