సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం లింగసానిపల్లి గ్రామసర్వేనం.117లో ‘నల్లవాగులో భూబకారాసులు’ శీర్షికన ‘సామాజికసారథి’లో వచ్చిన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. తహసీల్దార్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో నల్లవాగు భూముల ఆక్రమణపై శనివారం ఉదయం వెళ్లి విచారణ చేశారు. నల్లవాగులో ఉన్న ప్రభుత్వ భూమి సర్వేనం.117లో వెలిసిన ఇండ్లను వెంటనే కూల్చివేయాలని, వ్యవసాయ ప్రభుత్వ భూములలో ఇటుక బట్టీల నిర్మాణాలు చేస్తున్న వారికి కూడా నోటీసులు జారీ చేసి త్వరగా ఖాళీ చేయించాలని అక్కడి అధికారులకు […]