సామాజిక సారథి, రామకృష్ణాపూర్: మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ గనిలో శనివారం ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో గుజరాత్ రాష్ట్రానికి చెందిన కాంట్రాక్ట్ కార్మికుడు రాథోడ్ (25) ప్రమాదస్థలంలోనే మృతిచెందారు. స్థానికుల కథనం.. శనివారం మధ్యాహ్నం రెండో షిఫ్ట్ లో బ్లాస్టింగ్ అనంతరం వాహనాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా గ్రేడర్ తగలడంతో అక్కడిక్కడే మృతి చెందారు. వెంటనే సమీపంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ప్రాంతం కాని ప్రాంతం […]
సామాజికసారథి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ, గిరిజన గురుకులం, మహాత్మాజ్యోతి బాపూలే గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి చదివేందుకు గత మే 8వ తేదీన నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ర్యాంకు కార్డులను అందుబాటులో ఉంచారు. సీటు పొందిన విద్యార్థులు ఈనెల 20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు సంబంధిత స్కూలులో జాయిన్ కావాలని గురుకుల విద్యాలయాల సంస్థ అధికారులు ప్రకటించారు. సంబంధిత అధికారుల ఫోన్ నంబర్లను అందుబాటులో పొందుపరిచారు. వెబ్సైట్ లోకి […]