మనస్తాపంతో ఉపాధ్యాయిని ఆత్మహత్య ఇటీవలే ఆమెకు ట్రాన్స్ఫర్ సామాజికసారథి, నిజామాబాద్: ప్రభుత్వం చేసిన బదిలీలు ఉద్యోగుల గుండెలపై కుంపటిగా మారాయి. మనస్తాపానికి గురై ఆదివారం మరో ఉపాధ్యాయిని సూసైడ్ చేసుకున్నది. కుటుంబసభ్యుల కథనం.. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బాబాపూర్ కు చెందిన బేతల సరస్వతి (36) ప్రస్తుతం తమకు పక్కనే ఉన్న రెహత్‌నగర్ ప్రభుత్వ స్కూలులో టీచర్‌గా పనిచేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, కేటాయింపుల్లో భాగంగా ఆమెను ఇటీవల కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మర్లకుంటతండాకు […]
బీఎస్పీ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సామాజిక సారథి, నాగర్ కర్నూల్: తెలంగాణలోని ప్రతి పల్లెలో గడప గడపకు బహుజన సమాజ్ పార్టీని తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని బీఎస్పీ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడ, తిమ్మాజిపేట మండల కేంద్రం, తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామాల్లో బహుజన సమాజ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన […]
సామాజిక సారథి, భూపాలపల్లి: దేశానికి వెన్నెముఖ అయిన రైతును రాజును చేయడానికి రైతు బంధు పథకంను ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చారన్నారని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. ఆదివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి రెడ్డి అధ్యక్షతన రంగవల్లుల జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొన్ని మహిళ మహారాణులు వేసిన ముగ్గుల ను పరిశీలించి అనంతరం విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో మహిళ, శిశు […]
సామాజిక సారథి, నాగర్ కర్నూల్: ఇంజినీర్ల పని తనానికి నిలువుటద్దంగా నిలుస్తోంది. ఈ చిత్రం. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి నుంచి మినీ ట్యాంక్ బండ్ (కేసరి సముద్రం చెరువు)కు వెళ్లే దారిలో ఇంటికి నల్ల కనెక్షను ఇచ్చిన పైపులైను పూడ్చకుండానే రహదారి వేశారు. బరువుకు అణిగే ప్లాస్టిక్ పైపుల్లోంచి నీరు ఎలా వస్తుందో ఆ ఇంజినీర్లకే తెలియాలి. ఇప్పటికే రహదారికి రెండు వైపులా పైపులైన్లు నిర్మించాలన్ననిబంధన ఉన్నా ఒకేవైపు నిర్మించి, రెండు వైపులా […]
సామాజిక సారథి, తుర్కయంజాల్: కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో చేసిన పాపాలను తాము ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. తొర్రూర్ గ్రామానికి చెందిన సర్వేనంబర్ 383/1 లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో భూములు కోల్పోయిన రైతులతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్డీవో వెంకటాచారి కలిసి చర్చలు జరిపారు. 2007వ సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఎకరాకు లక్షన్నర పరిహారమిచ్చి తమ భూములను లాక్కుందని, నిరుపేదలమైన మాకు న్యాయం చేయాలని వారు వాపోయారు. నాలుగు […]
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి తప్పదు సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఆర్‌ఎస్‌ఎస్ నడుపుతోందని, స్టీరింగ్ వారిచేతుల్లోనే ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా ఆరోపించారు. శనివారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేస్తారని, ఇది 2024 సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపుతుందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడాలంటే ప్రతిపక్షాల పాత్ర కీలకం కాబోతోందన్నారు. […]
అధికార పార్టీల తీరు బీజేపీకి కలసివస్తోంది సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సామాజిక సారథి, తిరుపతి: పంజాబ్ రైతుల నిరసనపై ప్రధాని మోడీ కొత్త నాటకానికి తెరతీశారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పంజాబ్ లో తనను హత్య చేసేందుకు ప్రయత్నం జరిగిందని నరేంద్ర మోడీ సానుభూతి కోసం అసత్య ఆరోపణలు చేస్తున్నారని, నటనలో నేచురల్ స్టార్‌ని మించిపోయారని ఎద్దేవా చేశారు. పంజాబ్‌లో రైతులు ఆగ్రహంతో ఉండి అడ్డుకునే ప్రయత్నం […]
మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ముంబై: కరోనా వైరస్, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి తీవ్రం కావడంతో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించని పక్షంలో లాక్‌డౌన్ అమలు చేయక తప్పదని ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ టోపే హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో గడిచిన ఎనిమిది రోజుల్లో 1.17 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, అందులో ఒక్క మహరాష్ట్రలోనే 41 వేల కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. రోజురోజుకు కరోనాతోపాటు ఒమిక్రాన్కేసులు పెరిపోతున్నాయని, లాక్‌డౌన్ వద్దనుకుంటే కరోనా నియమాలు […]