సారథి, పరకాల: వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గం సంగెం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 122 మంది లబ్ధిదారులకు రూ.1.22 కోట్ల విలువైన కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హన్మకొండలోని తన నివాసంలో బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఒక పేదింటి ఆడబిడ్డ పెళ్లికి రూ.1,00,116 అందిస్తున్న ఏకైక సీఎం కేసీఆరేనని కొనియాడారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో మహిళల ఆత్మగౌరవాన్ని పెంచిన మహానుభావుడని […]
సారథి, వేములవాడ: రాష్ట్రంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. కోడె మొక్కులు చెల్లించుకున్న అనంతరం స్వామివారిని మంత్రి దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయ ఈవో, అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. మహామండపంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఆలయ ఈవో కృష్ణప్రసాద్ చిత్రపటం, ప్రసాదం అందజేసి సత్కరించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, కలెక్టర్ కృష్ణభాస్కర్ తదితరులు ఉన్నారు. వసతిగృహాల ప్రారంభంవేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నూతనంగా […]
సారథి, వేములవాడ: రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వేములవాడ పట్టణంలోని సినారె కళామందిరం, తెలంగాణ చౌక్ వద్ద షెడ్యూల్ కులాల సమగ్ర అభివృద్ధి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. హుజూరాబాద్ లో రాష్ట్రప్రభుత్వం దళితబంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలుచేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా అమలుచేసి ప్రతి దళిత కుటుంబానికి ఈనెల 30వ తేదీలోపు రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, దళితులకు మూడెకరాల భూమి […]
సారథి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం ట్రాఫిక్ ఎస్సై తిరుపతి ఆధ్వర్యంలో భద్రాచలంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి వాహనాలు నడుపుతున్నవారికి జరిమానాలు విధించారు. వాహనదారులపై ఉన్న పెండింగ్ చలాన్లను ఆన్లైన్ ద్వారా చెల్లించేలా పలు సూచనలు ఇచ్చారు. ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనాన్ని నడిపేటప్పుడు అన్ని లైసెన్స్, ధ్రువీకరణపత్రాలను కలిగి ఉండాలని సూచించారు.
సారథి, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా నాందేడ్– అకోలా హైవేపై పెద్దశంకరంపేట అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ట్రెయినీ ఎస్సై దీక్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల పెండింగ్ చలాన్లను పరిశీలించారు. ప్రతిఒక్కరూ వాహనం నడిపేటప్పుడు ధ్రువీకరణ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. వారి వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు.
సారథి, కోడేరు(కొల్లాపూర్): కోడేరు మండల కేంద్రంలోని వడ్డెర కాలనీలో విషజ్వరాల బారినపడిన ప్రతిఒక్కరినీ ఇంటింటికి తిరిగి కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కాలనీలో ప్రత్యేకంగా క్యాంపును ఏర్పాటుచేసి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. అవసరమైతే హైదరాబాద్ఆస్పత్రికి తీసుకెళ్తామన్నారు. అంబులెన్స్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందేలా చూస్తామన్నారు. అలాగే రైతుబీమా వచ్చేలా చూస్తామని హామీ […]