సారథి, చొప్పదండి: టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటూ.. వారిని వంచనకు గురిచేస్తూ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జ్ మేడిపల్లి సత్యం విమర్శించారు. మంగళవారం చొప్పదండి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. హుజూరాబాద్ ఉపఎన్నికల నేపథ్యంలో దళితబంధు అంటూ మరో కొత్త నాటకానికి తెరదీశారని అన్నారు. అన్ని నియోజకవర్గాల్లో దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని, లేకపోతే దళితులంతా […]
సారథి, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో మంగళవారం సీపీఎం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మొదటి వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు దబ్బకట్ల లక్ష్మయ్య, రాజయ్య మాట్లాడుతూ.. రాజయ్యకు వాజేడు మండల ప్రజలతో విడదీయలేని అనుబంధం ఉందని గుర్తుచేశారు. మండల ప్రజలను రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరించే వారని అన్నారు. మండలంలోని గ్రామాల అభివృద్ధికి తను శాసనసభ నిధులను వెచ్చించి పనిచేసేవారని అన్నారు, వ్యవసాయ కార్మిక, రైతాంగ, పోరాటాల్లో […]
సారథి, వేములవాడ: వేములవాడ పట్టణంలోని గౌతమ్ మాడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభచాటారు. ఇటీవల గుజరాత్ లోని జామ్ నగర్ లో జరిగిన ట్రెడిషనల్ యూత్ గేమ్స్ అండర్-19 హెవీ వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, కబడ్డీ పోటీల్లో లలిత, విజయ్ బాక్సింగ్ లో గోల్డ్ మెడల్స్ సాధించారు. శివసాయి, గణేశ్ కబడ్డీ పోటీల్లో మంచి ప్రతిభను కనబర్చారు. ఈ సందర్భంగా వారు మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ను కలిశారు. ఆయన ఆ విద్యార్థులకు […]
సారథి, వేములవాడ: దక్షిణకాశీగా పేరొందిన వేములవాడ పార్వతి రాజరాజేశ్వర స్వామివారి ఆలయాన్ని మంగళవారం రాష్టీయస్వయంసేవక్సంఘ్ అఖిల భారతీయ గ్రామవికాస్ సహ ప్రముఖ గురురాజాజీ, పద్మారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో ఆలయఅర్చకులు, వేదపండితులు వేదోక్త ఆశీర్వచనం చేశారు. అనంతరం స్వామి వారి అభిషేకం లడ్డూ, తీర్థప్రసాదాలను వారికి అందజేశారు. వారి వెంట రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వహిందు పరిషత్ సహాయ కార్యదర్శి గడప కిషోర్ రావు, భజరంగ్ దళ్ ప్రముఖ్ యశ్వంత్ ఉన్నారు.
సారథి, బిజినేపల్లి: ఆర్ఏహెచ్– యాక్ట్ పథకంలో భాగంగా రాయితీపై లబ్ధిదారులకు గడ్డి కత్తిరించే యంత్రాలను మంగళవారం నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని నందివడ్డేమాన్ గ్రామానికి చెందిన నలుగురు, లట్టుపల్లి గ్రామానికి చెందిన ఐదుగురు రైతులకు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండలంలోని ఐదు గ్రామాలు లట్టుపల్లి, నందివడ్డేమాన్, సల్కర్ పేట, వసంతపూర్, వట్టెం గ్రామాలు ఈ పథకానికి ఎంపికైనట్లు వివరించారు. ఈ […]