Breaking News

Day: August 1, 2021

‘బెదిరింపులతో పాలన సాగించలేరు’

‘బెదిరింపులతో పాలన సాగించలేరు’

సారథి, చొప్పదండి: సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిజాం సర్కార్​తరహాలో పాలన కొనసాగిస్తోందని చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్​చార్జ్​ మేడిపల్లి సత్యం అన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ​నిర్వహించిన చలో రాజ్​భవన్ ​ముట్టడి కార్యక్రమంలో తీవ్రంగా గాయపడి కోలుకుంటున్న ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ను ఆదివారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్యాయాలు, అక్రమాల మీద ప్రశ్నిస్తే పోలీసు కేసులు పెడుతున్నారని అన్నారు. టీఆర్ఎస్ ​ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు దోపిడీ, అన్యాయం, బెదిరింపులకు పాల్పడుతోందన్నారు. […]

Read More
బీజేపీ కార్యవర్గ సమావేశం

బీజేపీ కార్యవర్గ సమావేశం

సారథి, రామడుగు: మండల కేంద్రంలోని స్థానిక ఆర్య వైశ్య భవనంలో బీజేపీ రామడుగు మండల శాఖ కార్యవర్గ సమావేశం పార్టీ మండలాధ్యక్షుడు ఒంటెల కర్ణాకర్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. సమావేశంలో పార్టీ సంస్థగత నిర్మాణంపై చర్చించారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మేకల ప్రభాకర్ యాదవ్, మండల ఇన్​చార్జ్ రాపర్తి ప్రసాద్, కృష్టారెడ్డి, జిన్నారం విద్యాసాగర్, పొన్నం శ్రీనివాస్ గౌడ్, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Read More
జూరాలకు సందర్శకుల తాకిడి

జూరాలకు సందర్శకుల తాకిడి

సారథి, ధరూర్: జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ ​మండలంలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఆదివారం సందర్శకుల తాకిడి పెరిగింది. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాలకు ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి కృష్ణమ్మ జూరాలకు పరుగులు తీస్తోంది. ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో జూరాల అందాలను తిలకించేందుకు సందర్శకులు తరలివస్తున్నారు. స్నేహితుల దినోత్సవం కావడంతో జూరాల పరిసరాల్లో ఫోన్లలో సెల్ఫీ ఫొటోలు దిగుతూ తమ ఆనందం పంచుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చినవారు పక్కనే ఉన్న చేపల వంటకాన్ని […]

Read More
రాష్ట్రమంతటా దళితబంధు అమలుచేయాలి

రాష్ట్రమంతటా దళితబంధు

సారథి, బిజినేపల్లి: నిరంతరం పేదవర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్.శ్రీనివాస్ అన్నారు. సీఎం కేసీఆర్​ప్రకటించిన దళితబంధును రాష్ట్రమంతా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం బిజినేపల్లి మండల కేంద్రంలో గ్రామశాఖ మహాసభ జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. పాలకవర్గాలు ప్రజాసంక్షేమాన్ని మర్చిపోయి, పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కాలంలో సామాన్యుల జీవన ప్రమాణాలు తగ్గితే పెట్టుబడిదారుల ఆస్తులు పెరిగాయని అన్నారు. పాలకవర్గాలకు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే […]

Read More