Breaking News

Month: July 2021

త్వరలోనే కొత్త పింఛన్లు కూడా..

త్వరలోనే కొత్త పింఛన్లు కూడా..

సారథి, రామడుగు: కరీంనగర్ ​జిల్లా రామడుగు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ బుధవారం పలువురు లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దేనని కొనియాడారు. పెండింగ్​లో ఉన్న రేషన్ కార్డులను విడతల వారీగా ఇస్తామని, రానున్న రోజుల్లో అర్హులైన వారికి పింఛన్లు కూడా మంజూరు చేస్తామని ఎమ్మెల్యే సుంకే […]

Read More
కొవిడ్​ఉందనే రాలేకపోయా..

కొవిడ్​ ఉందనే రాలేకపోయా..

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ఇటీవల జర్మనీ నుంచి తిరిగొచ్చిన తర్వాత మొదటిసారి బుధవారం వేములవాడ రెండవ బైపాస్ రోడ్డులోని గెస్ట్ హౌస్ లో మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను ప్రజలకు దూరంగా ఉంటారని ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు, విమర్శలను తిప్పికొట్టారు. కొవిడ్ కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబసభ్యులతో జర్మనీలోనే ఉండాల్సి వచ్చిందని వెల్లడించారు. […]

Read More
పూసల సంఘం జిల్లా కమిటీ ఎన్నిక

పూసల సంఘం జిల్లా కమిటీ ఎన్నిక

సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా పూసల సంఘం సభ్యులు బుధవారం వేములవాడ కమాన్ చౌరస్తాలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ముద్రకోల ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా ముద్రకోల వెంకటేశం, కోశాధికారిగా ముద్రకోల గణేశ్​నియమితులయ్యారు. సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడ్ల సమ్మయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లాలోని 17 గ్రామాలకు చెందిన 70 మంది పూసల సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Read More
పునాది తవ్వితే.. బంగారమే బంగారం!

పునాది తవ్వితే.. బంగారమే బంగారం!

పనులు చేస్తుండగా కూలీలకు లభ్యం ఒకేచోట 100కు పైగా నాణేలు వెలుగులోకి.. వాటి విలువ రూ.కోటిపైమాటే సారథి, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో శివాలయం పక్కన జనార్ధన్ రెడ్డికి సంబంధించిన పాత ఇంటిని కూలగొట్టి కొత్త ఇల్లును కడుతుండగా, పునాదుల్లో బంగారు ఆభరణాలు, నాణేలు లభించాయి. అసలు విషయం ఇంటి యజమానికి చెప్పకుండా కూలీలు తలా పంచుకున్నారు. అసలు విషయం బుధవారం వెలుగుచూసింది. పునాదులు తవ్వడానికి 10 మంది కూలీలు పనిచేశారు. అందులో […]

Read More
చిన్నారులకు సకాలంలో టీకాలు వేయండి

చిన్నారులకు సకాలంలో టీకాలు వేయండి

సారథి, నాగర్​కర్నూల్: జిల్లాలో వ్యాధి నిరోధక టీకా కార్యక్రమం నిర్వహణపై బుధవారం జిల్లా వైద్యాధికారి(డీఎంహెచ్​వో) డాక్టర్​ సుధాకర్​లాల్ ​వైద్యాధికారులతో జూమ్​ మీటింగ్ ​నిర్వహించారు. చిన్నారులను గుర్తించి సకాలంలో బీసీజీ టీకాలు వేయాలని సూచించారు. తదుపరి సమాచారాన్ని తల్లిదండ్రులకు తెలియజేయాలని కోరారు. సమాచారాన్ని ఎప్పటికప్పుడు హెచ్ఎంఐఎస్ ​ఆన్ లైన్ పోర్టల్ లో నమోదు చేయాలని సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాన్పులు చేయించుకునేలా గర్భిణులను ప్రోత్సహించాలని అన్నారు. టెలీమెడిసిన్ విధానాన్ని రోగులు ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో […]

Read More
లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ

లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ

సారథి, కోడేరు. అర్హులైన పేదలకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన కొత్త రేషన్ కార్డులను నాగర్​కర్నూల్ ​జిల్లా కొల్లాపూర్​ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలకు రూ.10 లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. కోడేరు మండలానికి అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. మండల కేంద్రంలో డబుల్ రోడ్డు నిర్మాణ పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయని వివరించారు. కరోనా కారణంగా సంవత్సరన్నర కాలంగా […]

Read More
అబ్దుల్ కలామ్ మహోన్నతుడు

అబ్దుల్ కలామ్ మహోన్నతుడు

సారథి, రామడుగు: భారత మిస్సైల్స్ టెక్నాలజీ పితామహుడు, భారతరత్న, దివంగత రాష్ట్రపతి డాక్టర్​ ఏపీజే అబ్దుల్ కలామ్ మహోన్నత వ్యక్తి అని విద్యావంతుల వేదిక సభ్యులు కొనియాడారు. మంగళవారం ఆయన వర్ధంతిని పురస్కరించుకుని కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని గ్రంథాలయం పక్కన రామడుగు విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలామ్ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. కలామ్ ఆశయ సాధనకు యువత పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జక్కుల శ్రీను, […]

Read More
ఈ టైంలో కృష్ణానదిలోకి వెళ్లొద్దు.. ఎందుకంటే?

ఈ టైంలో కృష్ణానదిలోకి వెళ్లొద్దు.. ఎందుకంటే?

సారథి, కొల్లాపూర్: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్, పెంట్లవెల్లి మండలాల్లోని సోమశిల, మంచాలకట్ట, మల్లేశ్వరం గ్రామాల కృష్ణానది తీర ప్రాంతాలను సీఐ వెంకట్ రెడ్డి, ఎస్సై బాలవెంకటరమణ, సిబ్బందితో కలిసి ఆయన మంగళవారం పరిశీలించారు. సోమశిల కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటుచేశారు. నది ప్రవాహం ఉధృతంగా ఉన్నందున బోటింగ్ చేయడం, చేపలవేటకు వెళ్లడం, పర్యాటకులు నది నీటిలోకి దిగడం వంటి పనులు చేయకూడదని సూచించారు. ఈ సూచనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని […]

Read More