Breaking News

Month: July 2021

అభివృద్ధి పనులు ఇగ ఆగొద్దు

అభివృద్ధి పనులు ఇగ ఆగొద్దు

సారథి, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట మండలంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మెదక్ జిల్లా జడ్పీ సీఈవో వెంకట శైలేష్ అధికారులకు సూచించారు. బుధవారం పెద్దశంకరంపేట మండలం కమలాపూర్, మాడ్ శెట్ పల్లి గ్రామాల్లో వైకుంఠధామం తదితర అభివృద్ధి పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. వీలైనంత తొందరగా వైకుంఠధామం పనులు, కంపోస్టు ఎరువుల తయారీ తదితర పనులను పూర్తిచేయాలని కోరారు. పల్లెప్రగతిలో భాగంగా ప్రతి గ్రామంలో ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించుకునేందుకు ప్రతిఒక్కరూ […]

Read More
క్రమంగా తరలిస్తున్న లేగ దూడల పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న లేగ దూడల పట్టివేత

సారథి, పెద్దశంకరంపేట: మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట మండలం రామోజీపల్లి నుంచి డీసీఎం వాహనంలో అక్రమంగా తరలిస్తున్న12 లేగ దూడలను అల్లదుర్గం సీఐ జార్జ్, పెద్దశంకరంపేట ఎస్సై నరేందర్ కలిసి బుధవారం పట్టుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. రామోజీపల్లి అటవీ ప్రాంతంలో 30లేగ దూడలను తరలించేందుకు పలువురు వ్యక్తులు కట్టివేసి ఉంచారని, అందులో 12 లేగ దూడలను తరలిస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. ఈ విషయంపై కేసుదర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఆవులు, దూడలను తరలిస్తే కఠినచర్యలు […]

Read More
గ్రామస్తులకు మొక్కల పంపిణీ

గ్రామస్తులకు మొక్కల పంపిణీ

సారథి, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెంగళపూర్ గ్రామంలో పల్లెప్రగతి 4వ విడత, 7వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ గుండ రమ్య పలు రకాల పూలజాతుల మొక్కలను పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ ఇస్తున్న ఆరు మొక్కలను పెంచి సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో స్పెషలాఫీసర్, ఏపీఎం త్రివేణి, టీఆర్ఎస్ నాయకులు, మాజీ ఉపసర్పంచ్ గుండ గంగయ్య, సీఏ గాయత్రి, బి.శేఖర్, పి.హరీశ్,​గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More
ఘనంగా ఎమ్మార్పీఎస్​ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా ఎమ్మార్పీఎస్​ ఆవిర్భావ దినోత్సవం

సారథి, వాజేడు: ఎమ్మార్పీఎస్ 27వ ఆవిర్భావ దినోత్సవాన్ని ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు అరికెల వేణు మాదిగ సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం అనునిత్యం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పోరాటం చేస్తూనే ఉన్నారని కొనియాడారు. ఆరోగ్యశ్రీ, వికలాంగుల పింఛన్ ఎమ్మార్పీఎస్ పోరాట ఫలితంగానే ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని అన్నారు. దళితులను ఏడేళ్లుగా మోసం చేసిన […]

Read More
‘దళిత సాధికారత’ ప్రకటనపై హర్షం

‘దళిత సాధికారత’ ప్రకటనపై హర్షం

సారథి, గొల్లపల్లి: దళిత సాధికారత పథకాన్ని ప్రకటించిన సందర్భంగా జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో సీఎం కె.చంద్రశేఖర్​రావు, మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేశ్​నేత చిత్రపటాలకు ఎంపీపీ నక్క శంకరయ్య ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముస్కు లింగారెడ్డి, రమేష్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గొల్లపల్లి మారంపల్లి బాబు మండల ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి, డైరెక్టర్ జిల్లా గ్రంథాలయ సంస్థ జగిత్యాల మ్యాదరి లక్ష్మీ, టీఆర్ఎస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు ఎం.లక్ష్మి, నల్ల […]

Read More
పల్లెప్రగతితో గ్రామాలకు సొబగులు

పల్లెప్రగతితో గ్రామాలకు సొబగులు

సారథి, కొల్లాపూర్: పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల రూపురేఖలు మారనున్నాయని నాగర్​కర్నూల్ జిల్లా పరిషత్ చైర్​పర్సన్ ​పద్మావతమ్మ, కలెక్టర్ ఎల్.శర్మన్, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. సోమవారం కొల్లాపూర్ మండలం ఎల్లూరు, ముక్కిడిగుండం, పెంట్లవెల్లి మండలంలోని జటప్రోలు గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమంలో మొక్కలు నాటారు. మన ఇంటిని, వీధిని, ఊరును మనమే శుభ్రంగా ఉంచుకోవాలని, పల్లె ప్రగతి కార్యక్రమం ఉద్దేశం అదేనని వివరించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో […]

Read More
కొండా విశ్వేశ్వర్ రెడ్డిని పరామర్శించిన బీజేపీ చీఫ్​

కొండా విశ్వేశ్వర్ రెడ్డిని పరామర్శించిన బీజేపీ చీఫ్​

సారథి, హైదరాబాద్: చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాతృమూర్తి కొండా జయలతాదేవి ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ​సోమవారం కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు. కొండా జయలతాదేవి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన వెంట బీజేపీ సీనియర్ నేత గూడూరు నారాయణరెడ్డి, ఎస్.కుమార్, సంగప్ప తదితరులు ఉన్నారు.

Read More
హరితహారం దేశానికే స్ఫూర్తిదాయకం

హరితహారం.. స్ఫూర్తిదాయకం

సారథి, ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కేంద్రంలో మొక్కలు నాటి పల్లెప్రగతి, పట్టణప్రగతి, హరితహారం కార్యక్రమాలను మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కె.చంద్రశేఖర్ రావు చేపట్టిన హరితహారం కార్యక్రమం దేశానికి స్ఫూర్తివంతంగా నిలిచిందన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా నడుస్తోందన్నారు. నాటిన మొక్కలను పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే […]

Read More