సారథి, మానవపాడు: మేక ఒకే ఈతలో ఐదు పిల్లలు జన్మనిచ్చింది. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో నాగులకుంటవీధికి చెందిన కాపరి కురువ పరుశరాముడు మేక మంగళవారం ఈనింది. ఇలా ఒకే సారి ఐదు పిల్లలకు జన్మనివ్వడం అరుదని పశువైద్యులు తెలిపారు.
సారథి, చొప్పదండి: చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామంలో బయోపెన్సింగ్ డే కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్ గోరింటాకు మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్ ముద్దసాని చిరంజీవి, ఎంపీడీవో స్వరూప, ఎంపీవో జగన్మోహన్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ శరత్, పంచాయతీ కార్యదర్శి ప్రవళిక, వార్డు సభ్యులు ఏ.అరుణ, ఎల్.గౌతమి, సంపత్, ఏ.శ్రీనివాస్, కుమార్, సతీష్, కారోబార్ సలీం, మేటీ రాజేందర్, ఆపరేటర్ సాయికిరణ్, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.
సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో టీఆర్ఎస్వీ నాయకుడు నరేష్ రావన్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌చిత్రపటానికి మంగళవారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నరేష్ రావణ్ మాట్లాడుతూ.. దళితులను ఆర్థికంగా ఎదిగేందుకు సీఎం కేసీఆర్ప్రవేశపెడుతున్న తెలంగాణ దళితబంధు పథకం ద్వారా తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయని సంతోషం వ్యక్తంచేశారు. జీవితాంతం సీఎంకు రుణపడి ఉంటామని ప్రకటించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్నీరజాభూంరెడ్డి, 9వార్డు కౌన్సిలర్ కొత్తూరి మహేష్, 10వ వార్డు కౌన్సిలర్ […]
సారథి, నాగర్‌కర్నూల్: ముస్లింల పవిత్ర బక్రీద్ కు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. బుధవారం పండుగ కావడంతో ఈద్గాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షం కురిస్తే నమాజ్‌కు ఇబ్బందులు తలెత్తకుండా మసీదుల్లోనే ప్రార్థనలు చేసేలా ఏర్పాట్లుచేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డులోని ఈద్గా వద్ద మున్సిపాలిటీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈద్గాకు పెయింటింగ్ వేయించడంతో పాటు ఆవరణలో పారిశుద్ధ్య పనులు చేయించారు. స్టోన్డస్ట్పోసి బురదను సరిచేశారు. అలాగే జిల్లా కేంద్రంలోని జామా మసీద్‌ను […]
సారథి, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బూడిదపాడు గ్రామంలో విద్యుత్ షాక్ తో షేక్షావలి(60) అనే వ్యక్తి మంగళవారం మృతి చెందాడు. గ్రామంలో రోజు మాదిరిగానే నర్సరీలో మొక్కలకు నీళ్లుపడుతుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే కన్నుమూశాడు. షేక్షావలి ఉపాధి సేవకుడిగా పనిచేస్తున్నాడని, రోజు మాదిరిగానే నీళ్లు పడుతుండగా ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. ఈ మేరకు శాంతినగర్ ఎస్సై శ్రీహరికి సమాచారం అందించారు. ఆయన సంఘటనస్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు […]
సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో పిడియాట్రిక్ వైద్యసేవలు అందించేందుకు సరైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ సూపరింటెండెంట్ ను ఆదేశించారు. మంగళవారం వేములవాడ మండలం తిప్పాపూర్ ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నపిల్లలకు వైద్యసేవలు అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. 50 పడకల్లో భాగంగా 20 పడకలు ఐసీయూ, మిగతా 30 పడకలు జనరల్ కు కేటాయించాలని ఆదేశించారు. ఆక్సిజన్ ట్యాంక్పనులను […]
సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి కురుమ యువజన సంఘానికి నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని మంగళవారం మున్సిపల్ 8వ వార్డు కౌన్సిలర్ రాజన్నల రాజు, ప్రణీత సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. యువజన సంఘలు సేవాభావంతో పనిచేయాలని కోరారు. యువజన సంఘం అధ్యక్షుడిగా బండారి అనిల్, ఉపాధ్యక్షుడిగా గుంటి సాగర్, ప్రధాన కార్యదర్శిగా రాజన్నల శేఖర్, సంయుక్త కార్యదర్శిగా భూమల్లా సాగర్, కోశాధికారిగా గుంటి శ్యాంకుమార్, కన్వీనర్ గా ఏముండ్ల రాజ్ కుమార్, కోకన్వీనర్ గా జాతరకొండ […]