Breaking News

Day: July 4, 2021

పేదల సంక్షేమమే ధ్యేయం

పేదల సంక్షేమమే ధ్యేయం

సారథి, కొల్లాపూర్: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్​రెడ్డి అన్నారు. రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్​ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. ఆదివారం నాగర్​కర్నూల్ ​జిల్లా పెద్దకొత్తపల్లి మండలం నక్కలపల్లి, వెన్నచర్ల గ్రామాల్లో పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అధికారులు, ప్రజలతో కలిసి పల్లెప్రగతి కార్యక్రమం గురించి తెలుసుకున్నారు. అనంతరం మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్​రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో చెత్తాచెదారం లేకుండా ఇంటింటా చెత్తసేకరణ, […]

Read More
దొడ్డి కొమురయ్య స్ఫూర్తి అందరికీ ఆదర్శం

దొడ్డి కొమురయ్య స్ఫూర్తి అందరికీ ఆదర్శం

సారథి, చొప్పదండి: కరీంనగర్​ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో తెలంగాణ పోరాట వీరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతిని బీజేపీ ఓబీసీ మోర్చా మండలాధ్యక్షుడు పెద్ది వీరేశం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ట్యాంక్ బండ్ పై అమరుడి విగ్రహం లేకపోవడం విచాకరమన్నారు. దొడ్డి కొమురయ్య భవనాలు నిర్మిస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ నెరవేరలేదన్నారు. కొమురయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై […]

Read More
పారిశుద్ధ్యం అందరి బాధ్యత

పారిశుద్ధ్యం అందరి బాధ్యత

సారథి, చొప్పదండి: కరీంనగర్ ​జిల్లా చొప్పదండి మండలం కొలిమికుంట గ్రామంలో పల్లెప్రగతి పనులను జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య ఆదివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రహదారుల ఇరువైపులా మొక్కలు నాటాలని సూచించారు. ప్రతి ఆవరణలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి గ్రామస్తులను కోరారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కలు ఇవ్వాలని ఆదేశించారు. గ్రామాల్లో పెండింగ్ పనులు ఉండకూడదని సూచించారు. ఆయన వెంట సర్పంచ్ తాళ్లపల్లి సుజాత శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీ చిలుక రవిందర్, ఎంపీటీసీ తోట […]

Read More
ఆరోగ్య తెలంగాణ.. సీఎం సంకల్పం

ఆరోగ్య తెలంగాణ.. సీఎం సంకల్పం

డయేరియా ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి సారథి, రామాయంపేట: మొక్కలను పెంచి హరిత తెలంగాణను నిర్మించి ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్​ ఎంతో కృషిచేస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి కొనియాడారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం నిరంతర ప్రక్రియ అయినప్పటికీ ఈ 10రోజులు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నామని తెలిపారు. ఆదివారం ఆమె నిజాంపేట మండల కేంద్రంలో పల్లెప్రగతిలో కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటి నీళ్లుపోశారు. ఈ సందర్భంగా ఆమె […]

Read More
రాజన్నకు తీరొక్క మొక్కులు

రాజన్నకు తీరొక్క మొక్కులు

సారథి, వేములవాడ: శాతవాహన అర్బన్ డెవలప్​మెంట్​ చైర్మన్ జీవీ రాంకిషన్ ఆదివారం కుటుంబసమేతంగా దక్షిణకాశీగా పేరొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కోడె మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆత్మీయ స్వాగతం పలికారు. శాలువాతో సన్మానించి లడ్డూ ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

Read More
దొడ్డి కొమురయ్య పోరాటం చిరస్మరణీయం

దొడ్డి కొమురయ్య పోరాటం చిరస్మరణీయం

సారథి, గొల్లపల్లి: తెలంగాణ సాయుధ పోరాటవీరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల కేంద్రంలో ఆదివారం ఎంపీపీ ఆవుల సత్యం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. దొడ్డి కొమురయ్య చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాం నవాబుల దురాగతాలు, దొరల అరాచకాలకు వ్యతిరేకంగా భీకరమైన సాయుధ పోరాటంలో తెలంగాణ గడ్డపై ఒరిగారని గుర్తుచేశారు. కార్యక్రమంలో టీఆర్ ఎస్ మండలాధ్యక్షుడు బొల్లం రమేష్, ఉపసర్పంచ్ మారం శేఖర్, […]

Read More
ఘనంగా అల్లూరి జయంతి వేడుకలు

ఘనంగా అల్లూరి జయంతి వేడుకలు

సారథి, చొప్పదండి: ఏబీవీపీ చొప్పదండి శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా వద్ద అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి గుడెల్లి లక్మిపతి మాట్లాడుతూ.. తెల్లదొరల పాలిట సింహస్వప్నంగా నిలిచారని కొనియాడారు. శక్తివంతమైన మహాసామ్రాజ్యాన్ని గడగడలాడించి, బానిసత్వపు సంకెళ్లు తెంచి, మాతృదేశ విముక్తికి వీరోచితంగా పోరాటం చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో కార్తిక్, సంకేర్త్, అక్షయ్, చందు, వేణు, రాజు, ఉప్పి, అజయ్, ప్రమోద్ పాల్గొన్నారు.

Read More
రాజన్న సన్నిధిలో ఇంటలిజెన్సీ ఐజీ

రాజన్న సన్నిధిలో ఇంటలిజెన్సీ ఐజీ

సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పార్వతి రాజరాజేశ్వరి స్వామి వారిని ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఇంటలిజెన్స్ ఐజీ ప్రభాకరరావు సందర్శించారు. వారిని ఆలయ అర్చకులు సాదరంగా ఆహ్వానించారు. శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆలయ పీఆర్వో ఉపాధ్యాయుల చంద్రశేఖర్ రావు వారిని ఆశీర్వదించారు. లడ్డూప్రసాదం అందజేశారు.

Read More