సారథి,పెద్దశంకరంపేట: కరోనా నేపథ్యంలో రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు రైతుబంధు పథకం ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులను జమచేయడంతో పెద్దశంకరంపేటలో సీఎం కేసీఆర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి చిత్రపటాలకు మంగళవారం ప్రజాప్రతినిధులు, పలువురు రైతులు క్షీరాభిషేకం చేశారు. తెలంగాణలో 1.50 లక్షల ఎకరాలకు గాను 63.25లక్షల మంది రైతులకు రూ.7,058.78 కోట్లను వారి ఖాతాల్లో జమచేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్, రైతుబంధు మండలాధ్యక్షుడు సురేష్ గౌడ్, వైస్ […]
సారథి, పెద్దశంకరంపేట: ఇటీవల కరోనా బారినపడి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలువురు ఆర్ఎస్ఎస్ నిరుపేద కార్యకర్తలు, కుటుంబ సభ్యులకు సేవాభారతి ఆధ్వర్యంలో మంగళవారం నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పెద్దశంకరంపేట ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు సీతారామారావు, రవివర్మ, సతీష్ గౌడ్, జైహింద్ రెడ్డి, సర్వేశ్వర్, కృష్ణమూర్తి, విశ్వేశ్వర్ గౌడ్, శ్రీహరి, మధు, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెంకట్రావుపల్లి, రంగసాయిపల్లి కొక్కరకుంట గ్రామాల్లోని ఎరువులు, విత్తనాల విక్రయ దుకాణాలను మండల వ్యవసాయాధికారి యాస్మిన్ సోమవారం తనిఖీ చేశారు. షాపుల్లో నిల్వ ఉన్న స్టాక్, విత్తనాల లైసెన్సులు, పీసీ స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. డీలర్లు ఎరువులు, విత్తనాలను ఎమ్మార్పీకే విక్రయించాలని సూచించారు. రైతులకు డీలర్ల సంతకంతో కూడిన రసీదు తప్పకుండా ఇవ్వాలని ఆదేశించారు. లైసెన్సు ఉన్న షాపుల్లో మాత్రమే రైతులు ఎరువులు, విత్తనాలు కొనాలని కోరారు.
పెండింగ్ పనులు పూర్తి చేయాలి అలసత్వం వహించిన కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలి అధికారులతో ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సమీక్ష సారథి, ఎల్బీనగర్(హైదరాబాద్): నియోజకవర్గ పరిధిలోని నాలాల అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.113 కోట్లు మంజూరు చేసిందని ఎంఆర్‌డీసీ చైర్మన్, ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని జోనల్ కార్యాలయంలో అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రారంభం కావడంతో నియోజకవర్గంలోని […]
సారథి, హైదరాబాద్: అర్హులందరికీ గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం ద్వారా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని సోమవారం ఉప్పల్ డిప్యూటీ తహసీల్దార్ రఫీఉద్దీన్, అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ సరస్వతికి కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ పవన్‌కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ కోశాధికారి చింతల సురేందర్ యాదవ్, రంగారెడ్డి జిల్లా అర్బన్ బీజేపీ కార్యదర్శి పద్మారెడ్డి, రంగారెడ్డి జిల్లా అర్బన్ అధికార ప్రతినిధి కంది కంటి కన్నాగౌడ్, రంగారెడ్డి […]
తృటిలో తప్పిన భారీనష్టం సారథి, చొప్పదండి: చొప్పదండి మండలంలోని ఆర్నకొండ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో ఆదివారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగి పలు వస్తువులు కాలిబూడిదయ్యాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో చొప్పదండి ఎస్సై వంశీకృష్ణ ఫైర్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అప్పటికే బ్యాంక్ లోని మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్, క్యాషియర్ రూమ్ లు పూర్తిగా కాలిపోయాయి. పక్కనే ఉన్న లాకర్ రూమ్ కు మంటలు […]
చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సారథి, చొప్పదండి: మండల పరిషత్ సమావేశాల్లో సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు లేవనెత్తిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం చొప్పదండి మండల జనరల్ బాడీ మీటింగ్ ఎంపీపీ చిలుక రవీందర్ అధ్యక్షతన జరిగింది. అర్హులైన అందరికీ రేషన్ కార్డు లు ఇవ్వాలని ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు సింగిరెడ్డి క్రిష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఇంకుడు గుంతల బిల్లులు చెల్లించాలని పలువురు సభ్యులు […]
వర్చువల్ ద్వారా ప్రారంభించిన హైకోర్టు సీజే సారథి, కొల్లాపూర్: కొల్లాపూర్ లో మొదటి, 2వ అదనపు జూనియర్ సివిల్ కోర్టు భవనాన్ని వర్చువల్ ద్వారా సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమాకోహ్లీ హైదరాబాద్ నుంచి ప్రారంభించారు. నూతన కోర్టు ద్వారా కేసులు సత్వరం పరిష్కారమవుతాయని తెలిపారు. సివిల్ కోర్టు కేసుల విచారణకు ఇప్పటివరకు మహబూబ్ నగర్ లేదా హైదరాబాద్ కు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు ప్రజలకు, న్యాయవాదులకు సమయంతో పాటు వ్యయప్రయాసాలు తగ్గిపోతాయని అన్నారు. బార్ అసోసియేషన్, […]