సారథి, కోడిమ్యాల: కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేదలకు వరమని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండల కేంద్రంలో రూ.79,84,280 విలువైన కళ్యాణలక్ష్మీ చెక్కులను 80 మంది లబ్ధిదారులకు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నివర్గాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తోందని కొనియాడారు. ప్రతిఒక్కరి జీవితంలో వెలుగులు నింపేందుకే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కరోనా వంటి సంక్షోభ సమయంలోనూ […]
సారథి, మానవపాడు: పుష్కరాల సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలో భాగంగా అలంపూర్ నియోజకవర్గానికి వంద పడకల ఆస్పత్రిని మంజూరుచేస్తే స్థానిక నాయకులు కొందరు రచ్చరచ్చ చేసి ప్రజలకు ఉపయోగకరంగా ఉండే చోటును కాదని అడ్డుపడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు ఆత్మలింగారెడ్డి ఆక్షేపించారు. గురువారం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలోని అతిథిగృహంలో ఆయా గ్రామాల సర్పంచ్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని ఏడు మండలాలకు సెంటర్ పాయింట్ […]
సారథి, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని కొత్తపేట, రామోజీపల్లి గ్రామాల్లో తెలంగాణ సాంస్కృతిక సారథి జిల్లా కోఆర్డినేటర్కొమ్ముల శేఖర్ గౌడ్, నాగరాజు, సాయిలు, శ్రీనివాస్, మదన్, మాధవి, రవీందర్, రాజు నాయక్ కళాజాతా నిర్వహించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలైన రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, నాణ్యమైన సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, కరోనా వ్యాప్తిపై జాగ్రత్తలు, సూచనలు, వ్యాక్సినేషన్, మాస్క్ ప్రాధాన్యత, ఆరోగ్యం, హరితహారం, పల్లెప్రగతి, నూతన వ్యవసాయ పద్ధతులపై తమ ఆటాపాటల ద్వారా గ్రామస్తులకు […]