సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు సారథి, జగిత్యాల: రాష్ట్రంలో అదనపు కలెక్టర్లకు కియో వాహనాలు, పోలీసులకు ఇన్నోవాలు అందజేస్తున్న సీఎం కేసీఆర్ ఆ రెండు కంపెనీలకు డీలర్ గా మారారని మాజీమంత్రి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ మంత్రివర్గంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ ఫాంహౌస్ పై విచారణకు ఆదేశించాలని, నిబంధనల ప్రకారం ఉంటే దానిపై కోర్టులో స్టే ఎందుకు తెచ్చుకున్నారని ప్రశ్నించారు. […]
సారథి, వెల్దండ: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డీ-82 కాల్వలో నష్టపోయిన తన భూమికి నష్టపరిహారం ఇప్పించాలని నాగర్ కర్నూల్ ఎంపీ పి.రాములుకు బాధిత రైతు బొక్కల శ్రీను వినతిపత్రం అందజేశాడు. మంగళవారం వెల్దండకు వచ్చిన ఆయనకు సదరు రైతు కలిసి సమస్యలను వినతిపత్రంలో విన్నవించాడు. సంబంధిత అధికారులతో మాట్లాడి భూనష్టపరిహారం అందేలా చూస్తానని హామీఇచ్చారు.
నివాళులర్పించిన ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సారథి, వెల్దండ: కల్నల్ సంతోష్ కుమార్ త్యాగం వృథాకాదని నాగర్ కర్నూల్ ఎంపీ పి.రాములు, కల్వకుర్తి ఎమ్మెల్యే జి.జైపాల్ యాదవ్ కొనియాడారు. చైనా, భారత సరిహద్దులో దేశరక్షణ కోసం యుద్ధరణరంగంలో అసువులుబాసిన ఆయనను ప్రతిఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కల్నల్ సంతోష్ కుమార్ అమరత్వానికి ప్రతీకగా మంగళవారం వెల్దండ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. సంతోష్ కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి […]
సారథి,పెద్దశంకరంపేట: కరోనా నేపథ్యంలో రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు రైతుబంధు పథకం ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులను జమచేయడంతో పెద్దశంకరంపేటలో సీఎం కేసీఆర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి చిత్రపటాలకు మంగళవారం ప్రజాప్రతినిధులు, పలువురు రైతులు క్షీరాభిషేకం చేశారు. తెలంగాణలో 1.50 లక్షల ఎకరాలకు గాను 63.25లక్షల మంది రైతులకు రూ.7,058.78 కోట్లను వారి ఖాతాల్లో జమచేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్, రైతుబంధు మండలాధ్యక్షుడు సురేష్ గౌడ్, వైస్ […]
సారథి, పెద్దశంకరంపేట: ఇటీవల కరోనా బారినపడి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలువురు ఆర్ఎస్ఎస్ నిరుపేద కార్యకర్తలు, కుటుంబ సభ్యులకు సేవాభారతి ఆధ్వర్యంలో మంగళవారం నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పెద్దశంకరంపేట ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు సీతారామారావు, రవివర్మ, సతీష్ గౌడ్, జైహింద్ రెడ్డి, సర్వేశ్వర్, కృష్ణమూర్తి, విశ్వేశ్వర్ గౌడ్, శ్రీహరి, మధు, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.