సారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి(డీఎంహెచ్ వో) డాక్టర్ కె.సుధాకర్ లాల్ సోమవారం తనిఖీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిజినేపల్లి పీఎచ్ సీ పరిధిలో ప్రతి ఇంటిని సందర్శించి వారి ఆరోగ్యపరిస్థితులు తెలుసుకోవాలని సూచించారు. జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లునొప్పులు, గొంతు నొప్పి తదితర లక్షణాలు ఉన్న ఏ ఒక్కరినీ వదలకుండా నమోదుచేసుకుని, వారికి హోం ఐసొలేషన్ కిట్ ఇవ్వాలని సూచించారు. కరోనా […]
సారథి, బిజినేపల్లి: కరోనా బాధితులు, వారి కుటుంబాలకు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అండగా నిలిచారు. సోమవారం ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కరోనా బాధిత కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. తిమ్మాజీపేట మండలంలోని పోతిరెడ్డిపల్లి, బిజినేపల్లి మండలంలోని గుడ్లనర్వ, నాగర్ కర్నూల్ మున్సిపల్ పరిధిలోని ఉయ్యాలవాడ గ్రామంలో సరుకులు అందజేశారు. సంబంధిత కుటుంబాల్లో ఎమ్మె్ల్యే ధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపద సమయంలో […]
సారథి, నిజాంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో సోమవారం ఫర్టిలైజర్ దుకాణాల యజమానులతో భాస్వరం కరగదీసే బ్యాక్టీరియాపై మండల వ్యవసాయాధికారి సతీష్ అవగాహన నిర్వహించారు. రైతులు వేసిన భాస్వరం ఎరువు 40శాతం మాత్రమే మొక్కలు తీసుకుని మిగతా 60శాతం భూమిలో బంధించి ఉంటుందన్నారు. ఈ భాస్వరాన్ని ఈ బ్యాక్టీరియా ద్వారా అందుబాటులోనికి తీసుకురావచ్చన్నారు. అదేవిధంగా రైతులు భాస్వరం వాడకం తగ్గించాలని సూచించారు. పీఎస్ బీ స్టా్క్ రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలని డీలర్లకు సూచించారు. కార్యక్రమంలో […]