కరోనా ప్రభావమే కారణం అవసరాన్ని సొమ్ముచేసుకుంటున్న వ్యాపారులు సారథి, రాయికల్: కరోనా మహమ్మారి ప్రపంచాన్నే వణికిస్తోంది. కొందరు వైరస్ బారినపడి మృత్యువాతపడగా మరికొందరు మెల్లమెల్లగా కోలుకుంటున్నారు.ఈ సమయంలో వైద్యులు, నిపుణులు పండ్లను అధికంగా తినడం ద్వారా శరీరంలో ఇమ్యూనిటీ శక్తి పెరుగుతుందని సూచిస్తున్నారు. తద్వారా వైరస్ నశించిపోతుందని చెబుతున్నారు. వ్యాధి బారినపడిన పేదలు త్వరగా కోలుకోవాలనే తపనతో పండ్లను కొని తిందామంటే వాటి ధరలకు రెక్కలు వచ్చాయి. రెక్కాడితేనే డొక్కాడని పరిస్థితుల్లో పండ్లను కొనుగోలుచేసి తినే పరిస్థితి […]
సారథి, రామడుగు: రైతులకు అసౌకర్యం కలిగించకుండా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కరీంనగర్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ నిర్వాహకులకు చూచించారు. మండలంలోని వెదిర ఫ్యాక్స్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక తహసీల్దార్ కోమల్ రెడ్డి తో కలిసి సందర్శించారు. ఇప్పటివరకు ఎంత మొత్తంలో కొనుగోలు చేశారనే విషయాలను నిర్వాహకుల నుంచి తెలుసుకున్నారు. కొనుగోళ్లలో జాప్యం జరగకుండా చూడాలని సూచించారు. కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను జేసీ దృష్టికి తెచ్చారు. ఆయన వెంట మండల […]
సారథి, జగిత్యాల రూరల్: లాక్ డౌన్ నేపథ్యంలో జగిత్యాల రూరల్ మండలం ధరూర్ గ్రామంలోని ఎస్ఆర్ఎస్పీ కెనాల్ వద్ద పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించకుండా జగిత్యాల రూరల్ ఎస్సై చిరంజీవి తనిఖీలు చేపడుతున్నారు. అత్యవసరమైతేనే బయటికి రావాలని, లేదంటే ఏదైనా ముఖ్యమైన పనిఉంటే 10 గంటలలోపే పూర్తిచేసుకోవాలని సూచించారు. కరోనా నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.
సారథి, రామడుగు: దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని పంచాయతీరాజ్ సంఘటన్ జిల్లా కన్వీనర్, గోపాల్ రావు పేట సర్పంచ్ కర్ర సత్యప్రసన్న శుక్రవారం పాత్రికేయులకు సరుకులు, బియ్యం, పప్పు తదితర వాటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాత్రికేయులు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా అనునిత్యం వార్త సేకరణ చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో పాత్రికేయులు గంటే భాస్కర్, ఎజ్రా మల్లేశం, రామస్వామి, రజాక్, రమేష్, బొడిగే శ్రీను, మహేష్ పాల్గొన్నారు.