సారథి, నూగూరు వెంకటాపురం: ఏజెన్సీలో వేలంపాట రాజ్యాంగ విరుద్ధమని, గ్రామసభ ద్వారానే లబ్ధిదారుల ఎంపిక జరగాలని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు పూనేం సాయి అన్నారు. మంగళవారం ఏఎన్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. మేజర్ గ్రామ పంచాయతీలో మార్కెట్ ఆశీలు, జంతు వధశాల, కొలగార కాటరుసుం, బందెలదొడ్డి వేలంపాట ఏజెన్సీలో పెసా గ్రామసభ ద్వారానే లబ్ధిదారుల ఎంపిక జరగాలని కోరారు. మేజర్ గ్రామ పంచాయతీ ఈవో పెసా చట్టానికి విరుద్ధంగా వేలంపాట నిర్వహించాలని […]