సారథి న్యూస్, ములుగు: గ్రామపంచాయతీ పన్నులను వసూలు చేయాలని ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆదిత్య సురభి సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన పల్లెప్రకృతి వనాలు, సెగ్రిగేషన్ షెడ్స్ నిర్మాణం, పల్లె ప్రగతి అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. పల్లె ప్రకృతి వనాలను కాపాడాలని సూచించారు. ప్రతిఒక్కరూ మొక్కలను రక్షించుకునే బాధ్యతను తీసుకోవాలని కోరారు. జనరల్ ఫండ్స్ గ్రామాభివృద్ధికి వినియోగించుకోవాలన్నారు. పర్యాటక కేంద్రాలలైన రామప్ప, లక్నవరంలో టూరిస్టులు వచ్చి చెత్తపడేస్తున్నారని, వాటిని క్లీన్ చేయించేందుకు చార్జీలు వసూలు […]
సారథి న్యూస్, యాచారం: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి గెలువుకోసం విశేషంగా కృషిచేయాలని మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలో కాంగ్రెస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలకు గురిచేస్తోందని దుయ్యబట్టారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి కృష్ణాజలాల సాధనకు సీపీఎంతో కలిసి పోరాడి సాధించామని గుర్తుచేశారు. జడ్పీటీసీ నిత్యా నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: ప్రస్తుత పోటీ ప్రపంచంలో మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం పెద్దశంకరంపేట పీఆర్టీయూ మండల శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయినులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ మహిళా దేశానికి ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. మంచి అవకాశాలు కల్పిస్తే మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తారని అన్నారు. ఆడబిడ్డల వివాహానికి సీఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి ద్వారా రూ.లక్ష అందిస్తున్నారని […]
సారథి న్యూస్, ములుగు: నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విధుల నిర్వహణలో భాగంగా ఎన్నికల అధికారులకు మంగళవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో రెండవ విడత ట్రైనింగ్ ఇచ్చారు. రెవెన్యూ డివిజనల్ అధికారి, సహాయ ఎన్నికల అధికారి కె.రమాదేవి మాట్లాడుతూ.. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక జంబో బ్యాలెట్ బాక్స్, పెద్ద బ్యాలెట్ బాక్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ డ్యూటీని జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ములుగు తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, డీఏవో శ్రీనివాస్, […]
సారథి న్యూస్, మహబూబ్నగర్: ఏ అర్హత ఉందని మీకు గ్రాడ్యుయేట్లు ఓట్లు వేయాలని హైదరాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి ముకురాల శ్రీహరి టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవిని ఉద్ధేశించి విమర్శించారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు కూతురుగా అర్హత ఉంటే సరిపోతుందా? అని ప్రశ్నించారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో గిరిజన విద్యార్థి వేదిక, బహుజన స్టూడెంట్యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఎందుకు వేయడం లేదని […]
సారథి న్యూస్, చొప్పదండి: చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికాదని రామడుగు మండల టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కల్గెటి లక్ష్మణ్ ఆక్షేపించారు. స్థాయి తగ్గి మాట్లాడొద్దని హితవుపలికారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ పెట్టిన భిక్షతో శోభ జడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా గెలుపొంది, ఇప్పుడు టికెట్ రాకపోయే సరికి బీజేపీలో చేరి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. గతంలో సీఎం […]