హైదరాబాద్: ట్రాఫిక్, సైబర్ క్రైం సహా అన్ని విభాగాల్లో సైబరాబాద్‌లో 12 శాతం మంది మహిళా ఉద్యోగులు ఉన్నారని సైబరాబాద్ సీపీ సజ్జనార్ వివరించారు. పిల్లలు, మహిళల భద్రతపై ప్రత్యేకశ్రద్ధ వహించామని చెప్పారు. ఈ ఏడాది సైబరాబాద్‌కు 750 మంది మహిళా కానిస్టేబుళ్లు పోస్టింగ్‌పై వచ్చారని వెల్లడించారు. షీ టీమ్‌తో సమాజంలో మార్పు వస్తుందన్నారు. సమాజం, దేశం కోసం స్త్రీ శక్తి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. బుధవారం ఫిల్మ్ నగర్‌లో పోలీసుల ఆధ్వర్యంలో ‘షి పాహి’ కార్యక్రమం […]
హైదరాబాద్: కరోనా కేసులు తుగ్గుముఖం పట్టడంతో కేంద్రప్రభుత్వం కొన్ని ఆంక్షలను సడలించింది. సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్‌కు పూర్తిస్థాయి అనుమతులు ఇచ్చింది. జనవరి 31వ తేదీ నాటికి గతంలో విధించిన నిబంధనల గడువు ముగియనుంది. కేంద్ర హోంశాఖ బుధవారం కొత్త నిబంధనలు విడుదల చేసింది. ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. సినిమా హాళ్లు, థియేటర్లు గరిష్ట సీటింగ్ సామర్థ్యంతో ప్రదర్శనలు నిర్వహించేందుకు అనుమతిచ్చింది. ఇప్పటివరకు వీటిని 50 శాతం సీటింగ్ కెపాసిటీకి అనుమతిచ్చారు. […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 1నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 9, 10వ తరగతులకు విద్యార్థులను పంపించేందుకు 60శాతం మంది తల్లిదండ్రులు అంగీకార పత్రాలు అందించారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో విద్యాశాఖ అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యాసంస్థల పునఃప్రారంభం, ఇతర అంశాలపై అధికారులతో సమీక్షించారు. తరగతి గదిలో విద్యార్థుల మధ్య భౌతికదూరం పాటించాలని మంత్రి సూచించారు. 9వ తరగతిలోపు విద్యార్థులకు డిజిటల్ […]
సారథి న్యూస్, వాజేడు: ఖమ్మం, వరంగల్లు, నల్లగొండ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న(నవీన్‌కుమార్)బుధవారం ములుగు జిల్లా వాజేడు మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీడీవో, తహసీల్దార్ ఆఫీసు, ప్రభుత్వ ఆస్పత్రి, జడ్పీ హైస్కూలు, కస్తూర్బా విద్యాలయం, మినీ గురుకులంలో విధులు నిర్వహిస్తున్న పట్టభద్రులను కలిశారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తనకు ఒకసారి అవకాశమిస్తే భావితరాలకు భరోసాగా నిలుస్తానని, ప్రశ్నించే గొంతుకగా, ప్రజలపక్షాల నిలబడతానని అన్నారు. అంతకుముందు తీన్మార్ మల్లన్న […]