సారథి న్యూస్, మానవపాడు: తమ వ్యవసాయ పంట పొలాల గుండా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ వారు గ్యాస్ పైప్ లైన్ వేయొద్దని జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం గోకులపాడు గ్రామస్తులు రాయచూర్– కర్నూలు అంతర్రాష్ట్ర రహదారిపై రోడ్డుపై భైఠాయించి ఆందోళనకు దిగారు. తక్షణమే గ్యాస్ పైప్ లైన్ పనులను ఆపివేయాలని డిమాండ్ చేశారు. పైప్‌లైన్‌ద్వారా ప్రాణనష్టం వాటిల్లుతుందన్నారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసు అధికారులు వచ్చి నచ్చజెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.
సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల: పక్షులు, కోళ్లను బర్డ్‌ఫ్లూ మహమ్మారి కబళిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పౌల్ట్రీ రైతులను వణికిస్తోంది. క్రమంగా దక్షిణాది రాష్ట్రాలకు కూడా బర్డ్‌ఫ్లూ మహమ్మారి పాకినట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా, జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం అనంతపురం గ్రామంలో ఉన్నట్టుండి 20 నుంచి 30 నాటుకోళ్లు ఒకేరోజు చనిపోవడం కలకలం రేపింది. ఈ కోళ్లకు బర్డ్‌ఫ్లూ వచ్చిందా? మరేదైనా కారణమా? అని బాధిత పెంపకందారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత […]