సారథి న్యూస్, మహబూబ్నగర్: అలంపూర్ పట్టణంలో జనవరి 13, 14 తేదీల్లో నిర్వహించే స్వేరోస్ సంబరాల పోస్టర్లను ఫిట్ ఇండియా ఫౌండేషన్ సభ్యులు డాక్టర్ ఆర్ఎస్ ప్రసన్న కుమార్, సీనియర్ స్వేరో కేశవరావు, గురుకుల విద్యాలయాల అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్ డాక్టర్ సోలపోగుల స్వాములు, తోకల కృష్ణయ్య, హరినాథ్ సమక్షంలో నేహా షైన్ హాస్పిటల్ ఎండీ విజయ్ కాంత్ చేతులమీదుగా గురువారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్వేరో సర్కిల్ అధ్యక్షుడు లక్ష్మణ్, నాగరాజ్, మహబూబ్నగర్ జిల్లా కమిటీ అధ్యక్షుడు […]
సారథి న్యూస్, రామగుండం: సింగరేణిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేయాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతారామయ్య డిమాండ్ చేశారు. గురువారం జరిగిన గేట్మీటింగ్లో ఆయన మాట్లాడారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకపోవడంతో ప్రస్తుతం ఉన్నకార్మికులపై పనిభారం పెరిగిందన్నారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు మేరుగు రాజయ్య, మహేందర్ రావు, కె.కనకరాజు, బళ్లు రవి, భోగ సతీష్, భాస్కర్, అబ్దుల్ కరీం, గంగారపు […]
సారథి న్యూస్, రామగుండం: టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అన్ని కులాలకు ప్రాధాన్యం దక్కిందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గురువారం స్థానిక 18వ డివిజన్ లో పద్మశాలి నూతన భవనానికి ఎమ్మెల్యే భూమి పూజచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నికులాల అభ్యున్నతికి కృషిచేసిందన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేటర్ బద్రి అంజలిదేవి, భూమయ్య, శంకర్, గుండ్ల రామచందర్, గుండేటి ప్రభాకర్ పాల్గొన్నారు.
సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లా పరిధిలోని పస్రా అటవీ రేంజ్ పరిధిలోని వెంకటాపూర్ సెక్షన్ ఎల్లారెడ్డిపల్లి వెస్ట్ బీట్ 200 హెక్టార్లలో చేపట్టిన అటవీ పునరుద్ధరణ పనులను రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్(కంపా) ఆఫీసర్ లోకేష్ జైస్వాల్, వరంగల్ సీసీఎఫ్ ఎంజే అక్బర్ గురువారం పరిశీలించారు. గతంలో చేపట్టిన అభివృద్ధి పనుల ఫొటో ప్రజంటేషన్ గ్యాలరీని ఏర్పాటుచేశారు. స్థానిక అటవీశాఖ అధికారులు పునరుద్ధరణ గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అటవీ సంరక్షణకు చర్యలు […]