సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని ఇసుకపాయల తండా గ్రామంలో రూ.1.08 కోట్ల వ్యయంతో మంజూరైన 20 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి బుధవారం భూమిపూజ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, జడ్పీటీసీ సభ్యుడు విజయరామరాజు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళీ పంతులు, సర్పంచ్ సుభాష్, ఎంపీటీసీ సభ్యులు, వీణా సుభాష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు వేణుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల: ఈనెల 13, 14 తేదీల్లో అలంపూర్ పట్టణంలో నిర్వహిస్తున్న స్వేరో సంబరాలను విజయవంతం చేయాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్ డాక్టర్ సోలపోగుల స్వాములు కోరారు. బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని బూడిదపాడ్ గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. సంబరాల్లో భాగంగా పరుగు పందెం, లాంగ్‌జంప్, షార్ట్‌పుట్, కవితలు, పాటలు, వ్యాసరచన, చిత్రలేఖనం.. తదితర పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సంబరాలకు బూడిదపాడ్, కలుగొట్ల […]