సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మెదక్ జిల్లా చిన్నశంకరంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం కోవిడ్–19 వ్యాక్సినేషన్ పై ఏఎన్ఎం,ఆశా వర్కర్లకు మెడికల్ ఆఫీసర్ శ్రావణి శిక్షణ కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వ్యాక్సిన్‌ను మొదట ఫ్రంట్ లైన్ వారియర్స్ హెల్త్, పోలీస్, శానిటేషన్ సిబ్బందికి, తర్వాత 60 ఏళ్లు పైబడిన, మరియు దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు, అలాగే 50 ఏళ్లు పైబడిన వారికి, చివరగా 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ చేయాలన్నారు. […]
ఇండియా అంతా ఎదురుచూస్తున్న సినిమా ‘కేజీఎఫ్ 2’ అంటే అతిశయోక్తి కాదేమో. ఆ సినిమాకొచ్చిన క్రేజ్ అలాంటిది. ‘కేజీఎఫ్’ ఫస్ట్ పార్ట్ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైంది. నార్త్, సౌత్‌లో ఒక ఊపు ఊపేసింది. సీక్వెల్ కోసం అభిమానులంతా తెగ ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్, శ్రీనిధిశెట్టి జంటగా సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, రవీనాటాండన్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈమూవీ నుంచి ఓ క్రేజీ అప్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. 2021 జనవరి 8న […]
పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం సోమవారం ప్రారంభమైంది. సాగర్ కె.చంద్ర దర్శకుడు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ముహూర్తపు షాట్ కు పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టారు. త్రివిక్రమ్ కెమెరా స్విచాన్ చేశారు. స్క్రిప్ట్ ను ఎస్. రాధాకృష్ణ దర్శక నిర్మాతలకు అందించారు. దిల్ రాజు, వెంకీ అట్లూరి సహా పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మలయాళంలో సూపర్ హిట్ సాధించిన ‘అయ్యప్పనుమ్ […]
యాక్షన్ హీరో గోపీచంద్, మిల్కీబ్యూటీ తమన్నా భాటియా జంటగా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘సీటీమార్’. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతోంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై చిట్టూరి శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్నా ఈ చిత్రంలో కబడ్డీ కోచ్ జ్వాలారెడ్డిగా కనిపించబోతోంది. సోమవారం తమన్నా పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్ ను విడుదల చేస్తూ చిత్ర యూనిట్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపింది. గోపీచంద్ ఆంధ్రప్రదేశ్ మహిళా కబడ్డీ జట్టుకు కోచ్ […]