సక్సెస్తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు సాయికుమార్ తనయుడు ఆది. ఈ క్రమంలో ఆది నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జంగిల్’. ఆదికి జోడీగా వేదిక నటించింది. హార్రర్ జోనర్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి కార్తీక్, విఘ్నేష్ దర్శకత్వం వహిస్తున్నారు. రణవీర్ కుమార్ సమర్పణలో న్యూ ఏజ్ సినిమా, ఆరా సినిమాస్ బ్యానర్స్ పై మహేశ్ గోవిందరాజ్, అర్చనచందా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నోయరిక లల్లు, మధుసూదన్ రావు, జై కుమార్ తదితరులు నటించారు. […]
డిసెంబర్ 1న మహానగర ఎన్నికలు మేయర్స్థానం జనరల్ మహిళకు కేటాయింపు 150 వార్డులు.. 9,238 పోలింగ్ సెంటర్ల ఏర్పాటు వివరాలు వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సారథి న్యూస్, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు నగారా మోగింది. డిసెంబర్ 1న ఓటింగ్ నిర్వహించి, డిసెంబర్ 4న ఫలితాలు వెల్లడిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి మంగళవారం మీడియా సమావేశంలో తెలిపారు. అవసరమైన చోట్ల డిసెంబర్ 3న రీ పోలింగ్ నిర్వహిస్తామని వివరించారు. […]
హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా రూపొందుతున్న చిత్రం ‘సెహరి’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు నందమూరి బాలకృష్ణ. అప్పుడు సినిమా విశేషాలతో పాటు చాలా విషయాలు మాట్లాడారు. ‘కరోనా అనేది న్యూమోనియాకి సంబంధించింది. దీనికి ఇంతవరకు వ్యాక్సిన్ రాలేదు. ఆరోగ్య భద్రతలు పాటిస్తూ జాగ్రత్తగా ఉంటే మంచిది. అందరూ ఆరోగ్యంగా ఉండండి..’ అని చెప్పారు. కోటి కీలకపాత్రలో నటిస్తున్న ‘సెహరి’ చిత్రానికి జ్ఞానసాగర్ దర్శకుడు. అద్వయ జిష్ణురెడ్డి, శిల్పాచౌదరి నిర్మిస్తున్నారు. ఇటీవలే మూవీ పనులు […]