దుబాయ్: డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ మరో టైటిల్ వేటలో ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. కీలకమైన క్వాలిఫయర్-1లో మ్యాచ్‌లో ఢిల్లీపై 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగులు చేసింది. లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ తొలి ఓవర్‌లోనే పృథ్వీ షా(0), అజింక్యా రహానే(0) వెంటవెంటనే ఔటయ్యారు. సున్నా పరుగులకే మూడు వికెట్లు కోల్పోయారు. స్టోయినిస్(65; 46 బంతుల్లో 4×6, […]