అమరావతి: మూడు రాజధానుల బిల్లుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈనెల 14 వరకూ రాజధానుల బిల్లుపై హైకోర్టు స్టే విధించింది. రాజధాని విభజన పిటిషన్లపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. పిటిషన్ల తరఫున శ్యామ్ దివాన్, ఉన్నవ మురళీధర్ వాదనలు వినిపించారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్దాఖలుకు 10 రోజుల సమయం కోరారు. విచారణను ఈనెల 14కు […]
కేజీఎఫ్ 2లో ప్రధాన విలన్‌గా సంజయ్‌దత్ అధీరా రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్లో సంజయ్‌దత్ భయానకంగా కనిపిస్తున్నారు. ముఖంపై టాటూలు, పెద్ద జడతో సంజయ్ లుక్ క్రూషియల్‌గా ఉంది. ఆయన లుక్ చూసిన తర్వాత కేజీఎఫ్2 లో ఆయన పాత్ర చాలా క్రూరంగా ఉంటుందని అనిపిస్తుంది. ఈ లుక్ వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెలియజేశారు. […]
అఖిల్ అక్కినేని చిన్నప్పటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హ్యట్ పెట్టుకుని చేతిలో గన్ తో కౌ బాయ్ గెటప్ లో ఉన్న ఆ ఫొటో ఒకటి ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఈ ఫొటోకు ఓ నేపథ్యం ఉంది. 2002లో మహేశ్‌బాబు టక్కరిదొంగ అనే కౌ బాయ్ సినిమా చేశాడు. ఆ సినిమా ప్లాప్ అయింది అది వేరే విషయం. అయితే అప్పట్లో మూవీ సెట్‌కు వెళ్లిన అఖిల్.. కౌ బాయ్ గెటప్‌లో సరదాగా […]
తమిళ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఓ సినిమాలో నటించనున్నట్టు సమాచారం. కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమా తెలుగు, తమిళనాట సూపర్‌హిట్ అందుకున్నది. దీంతో ఖైదీ సినిమా చూసిన మహేశ్ బాబు.. కనగరాజ్ డైరెక్షన్‌కు ఫిదా అయ్యారట. అయితే వీరు తీయబోయే చిత్రానికి ఓ తెలుగు రచయిత పవర్ఫుల్ కథను కూడా సిద్ధం చేసినట్టు టాక్. ‘భరత్ అనే నేను’ ‘మహర్షి’ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలతో హ్యాట్రిక్ అందుకున్న మహేశ్.. కథల విషయంలో […]
న్యూఢిల్లీ: అయోధ్య మహాఘట్టానికి వేళయింది. ఆలయ నిర్మాణానికి బుధవారం మధ్యాహ్నం ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. శ్రీరాముడి జన్మభూమి అయోధ్యలో బృహత్తర రామాలయం నిర్మాణానికి మరికొన్ని గంటల్లో భూమిపూజ మహోత్సవం జరగనుంది. ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా గర్భగుడిలో 40 కిలోల వెండి ఇటుకలను ప్రతిష్ఠించి..నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సంఘ్ అధినేత మోహన్ భగవత్ తదితరులు రానున్నారు. బీజేపీ అగ్రనేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమంలో పాల్గొంటారు.ఇదీ చరిత్రసరయూనది ఒడ్డున […]
సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ నుంచే కరోనాకు తొలి టీకా వస్తుందని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ఆశాభావం వ్యక్తంచేశారు. హైదరాబాద్ లోని జీనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటిక్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ సెంటర్ ను మంత్రి మంగళవారం సందర్శించారు. వ్యాక్సిన్ తయారీలో భారత్ బయోటెక్ ముందంజలో ఉండడం గర్వంగా ఉందన్నారు. టీకాల తయారీలో భారత్ భాగస్వామ్యం కీలకమైందని ప్రపంచ దేశాలు పదేపదే చెబుతున్నాయని గుర్తుచేశారు. మంత్రితో భారత్బయోటెక్ఎండీ డాక్టర్కృష్ణా […]
సారథిన్యూస్, హైదరాబాద్: ప్రముఖ హాస్యనటుడు, వైసీపీ నేత పృథ్విరాజ్‌కు కరోనా అంటుకుంది. పదిరోజుల నుంచి ఆయన తీవ్రజ్వరం, జలుబుతో బాధపడుతున్నారు. దీంతో వైద్యుల సూచనమేరకు పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయింది. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. వైద్యుల సూచన మేరకు తాను 15 రోజులు క్వారంటైన్లో ఉంటానని చెప్పారు.
ముంబై: బాలీవుడ్ అందాల భామ కృతి సనన్ సూపర్ చాన్స్ దక్కించుకున్నది. హృతిక్‌రోషన్ తదుపరి చిత్రం క్రిష్4లో ఆమె హీరోయిన్గా నటించనున్నట్టు సమాచారం. హృతిక్ తండ్రి రాకేశ్ రోషన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హృతిక్ నాలుగు విభిన్న పాత్రల్లో నటించనున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో తొలుత ప్రియాంకను అనుకున్నారట. కానీ ఆమె హాలీవుడ్లో బిజీగా ఉండటంతో క్రితికి అవకాశం దక్కిందని టాక్.