చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరుకు చెందిన ఓ స్వర్ణకారుడు వినూత్నంగా ఆలోచించి బంగారం, వెండితో మాస్కును తయారుచేశాడు. బంగారుమాస్కును 2.75 లక్షలకు, వెండి మాస్కును రూ.15,000 లకు విక్రయిస్తున్నట్టు ఆ స్వర్ణకారుడు తెలిపారు. ఇప్పటికే వీటికి 9 ఆర్డర్లు వచ్చాయని చెప్పారు. ధనవంతులు తమ హోదాకు చిహ్నంగా ఓ మాస్కులను కొనుగోలు చేస్తున్నారని ఆయన చెప్పారు.
లక్నో: మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ (85) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ మేరకు ఆయన కుమారుడు అశుతోష్ ట్వీట్‌చేశారు. ఆయన కొంతకాలంగా జ్వరం, మూత్రపిండాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. నెల క్రితం లక్నోలోని ఓ ఆస్పత్రిలో చేరారు. టాండన్ మాజీ ప్రధాని వాజపేయికి సన్నిహితుడు. ఉత్తర్‌ప్రదేశ్ మంత్రిగా కొంతకాలం పనిచేశారు. చిన్నప్పటినుంచే టాండన్ ఆరెస్సెస్‌లో క్రియాశీలకంగా ఉండేవారు. తర్వాత జనసంఘ్‌లో చేరారు. టాండన్ మృతికి ప్రధాని మోదీ, కేంద్రమత్రి స్మృతి ఇరానీ సంతాపం తెలిపారు.
నేటినుంచే శ్రావణమాసం ప్రారంభం ఈ మాసంలోనే విశిష్ట పర్వదినాలు సన్నటి చిరుజల్లులతో నాన్పుడు వానలు.. అడపాదడపా కుంభవృష్టి.. బోనాల సందడి.. మంగళగౌరీ వ్రతాలు, వరలక్ష్మీ వ్రతాలు, పచ్చగా పసుపు పూసిన పాదాలతో సందడిగా తిరిగే ముత్తయిదువల కళకళ.. అంతటా ఆధ్యాత్మిక వాతావరణం, ప్రకృతి శోభ ఇనుమడించే తరుణమిది…ఇలా ఎన్నో విశిష్టతలు కలిగిన శ్రావణ మాసం ప్రత్యేకతలపై ‘సారథి’ అందిస్తున్న స్పెషల్ స్టోరీ.. శ్రావణ మాసం అంటే శుభమాసం. శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు. […]
ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నది. గత 24 గంటల్లో 176 మంది కరోనాతో మృతిచెందగా.. మొత్తం మృతుల సంఖ్య 12,030కి చేరింది. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు 3,18,695 మందికి కరోనా సోకింది. గత 24 గంటల్లో 8,240 కొత్త కేసులు నమోదయ్యాయి. 1,75,029 మంది కోలుకున్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. దేశంలో అత్యధిక కేసులో మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి.