టాలీవుడ్ లో యంగ్ హీరోలంతా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఆల్రెడీ నిఖిల్ ఒక ఇంటివాడవగా లిస్ట్లో రానా, నితిన్లు ఉన్నారు. చాలా రోజులుగా శాలినిని ప్రేమిస్తున్న నితిన్ మొన్న ఏప్రిల్ నెలలో పెళ్లికి సిద్ధమయ్యాడు. దుబాయ్లో భారీ డెస్టినేషన్ మ్యారేజీకి నాలుగు నెలల ముందే ప్లాన్ చేశారు కూడా. అయితే కరోనా కారణంగా సీన్ రివర్స్ అయ్యింది. మధ్యలో మళ్లీ మ్యారేజ్ని దుబాయ్లోనే జరిపిస్తామంటూ రెండు ఫ్యామిలీలు ప్రకటించాయి. అయితే పరిస్థితులు ఇప్పుడప్పుడే కుదుట పడేటట్లు లేని […]
క్షణం తీరిక లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్న నాని ప్రస్తుతం ‘వి’ చిత్రంతో విడుదలకు రెడీగా ఉన్నాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమాతో పాటు శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ సినిమా చేస్తున్నాడు నాని. అలాగే ‘ట్యాక్సీవాలా’ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగరాయ్’ తన మరో చిత్రాన్ని ప్రకటించిన సంగతీ తెలిసిందే. ‘జెర్సీ’చిత్రాన్ని నిర్మించిన సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రానికి నిర్మాత. […]
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని సౌత్ అనంత్‌నాగ్ జిల్లా బిజ్‌బెహరాలో టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో ఒక సీఆర్‌పీఎఫ్ జవాను, ఐదేళ్ల బాలుడు మృతిచెందారు. సెక్యూరిటీ ఫోర్స్‌పై టెర్రరిస్టులు కాల్పులు జరపడంతో ఈ ఘటన జరిగినట్లు ఆర్మీ అధికారులు చెప్పారు. సీఆర్‌పీఎఫ్ 90 బెటాలియన్ వద్ద రోడ్ ఓపెనింగ్ జరుగుతుండగా టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సీఆర్‌పీఎఫ్ జవాను, ఐదేళ్ల బాలుడికి గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేర్పించగా.. ట్రీట్‌మెంట్ తీసుకుంటూ చనిపోయారని పోలీసులు చెప్పారు. టెర్రరిస్టులు కోసం గాలిస్తున్నామని అన్నారు. […]
సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం షానగర్ వరద కాల్వపై మోతె కాల్వల నిర్మాణానికి భూమి పూజ చేసి ఏడాది గడిచినా ఇప్పటికి పనులు ప్రారంభించకపోవడంతో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జ్మేడిపల్లి సత్యం, ఆ పార్టీ నాయకులు శుక్రవారం వినూత్నరీతిలో చెవిలో పువ్వులతో నిరసన వ్యక్తం చేశారు. ఏడాది క్రితం ఎంతో అట్టహాసంగా జిల్లా మంత్రి ఈటల రాజేందర్ శంకుస్థాపన చేసి ఇప్పటివరకు ఒక్క రూపాయి పని కూడా మొదలు పెట్టలేదని ఎద్దేవా చేశారు. […]
సారథి న్యూస్, హైదరాబాద్: బుల్లితెర రియాలిటీ హిట్ షో బిగ్‌బాస్‌హౌస్‌లోకి బిత్తిరి సత్తి వెళ్లనున్నారా.. అందుకే తాను పనిచేస్తున్న చానెల్లో ఉద్యోగానికి రాజీనామా చేశారా.. అవుననే అంటున్నాయి మీడియా వర్గాలు. తీన్మార్ వార్తల ద్వారా బిత్తిరి సత్తిగా సుపరిచితుడైన చేవెళ్ల రవికుమార్ బిగ్‌బాస్ సీజన్4లో పాల్గొనున్నట్లు తెలిసింది. ఆయనతో పాటు ప్రముఖ యాంకర్, గాయని మంగ్లీ, హీరో తరుణ్, యాంకర్ వర్షిణి సౌందరరాజన్, సీరియల్ నటుడు అఖిల్ సార్థిక్ బిగ్‌బాస్ హౌస్‌లో సందడి చేయనున్నట్లు తెలిసింది. అయితే […]
సారథిన్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ఊరూరా జోరుగా సాగుతున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సారపాక ఫారెస్ట్ రేంజ్ కు చెందిన 30 ఎకరాల్లో మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, విప్ రేగా కాంతారావు తదితరులు మొక్కలు నాటారు. కొత్తగూడెంలోని పోలీస్ హెడ్ కార్టర్స్‌లో ఎస్పీ సునీల్ దత్ హరితహారంలో పాల్గొన్నారు. బూర్గంపాడులోని సారపాక పుష్కర వనం వద్ద మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ […]
కృష్ణచైతన్య దర్శకత్వంలో నితిన్ హీరోగా నటిస్తున్న ‘పవర్‌పేట’ చిత్రంలో ఓ బలమైన పాత్రలో నదియా అలరించబోతున్నారట. ఇప్పటికే కృష్ణచైతన్య దర్శకత్వంలో నితిన్ ‘ఛల్ మోహన్ రంగ’ చిత్రంలో నటించారు. మరోసారి వీరిద్దరి కాంబినేషనలో మరో చిత్రం రాబోతున్నది. కీర్తీ సురేష్ కథానాయికగా నటించబోతున్నారని సమాచరాం. నటుడు సత్యదేవ్ ఓ కీలక పాత్ర చేయనున్నారు. కథరీత్యా ఇందులో నితిన్ మూడు గెటప్స్‌లో కనిపించనున్నారు. నితిన్ లుక్స్ కోసం హాలీవుడ్ మేకప్‌మేన్‌ని తీసుకోబోతున్నారట టీమ్. ఈ చిత్రం రెండు భాగాల్లో […]
కరోనా ప్రభావంతో ప్రస్తుతం సినిమాలు థియేటర్లలో విడుదలయ్యే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాణ సంస్థలన్నీ వెబ్‌సిరీస్‌లు నిర్మిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభాస్ మిత్రబృందం.. యూవీ క్రియేషన్స్ సంస్థ ఆ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించనున్నట్టు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే పూరి జగన్నాథ్, సుజిత్ వంటి స్టార్ డైరెక్టర్లను ఈ సంస్థ సంప్రదించిందట. చాలా మంది యువహీరోలు కూడా వీరి వెబ్ సిరీస్‌లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారట. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్టు సమాచారం.