Breaking News

Day: June 10, 2020

మంత్రులు కనిపిస్తలేరు

సారథి న్యూస్, రామడుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు కనిపించడం లేదని బుధవారం రామడుగు పోలీస్ స్టేషన్ లో బీజేపీ నాయకులు ఫిర్యాదుచేశారు. బీజేపీ మండలాధ్యక్షుడు ఒంటెల కర్ణాకర్ రెడ్డి మాట్లాడుతూ బాధ్యత కలిగిన హోదాలో ఉండి కూడా ప్రజాసమస్యలను గాలికొదిలేసి తిరుగుతున్నారని ఆరోపించారు. వరి ధాన్యం తూకాల్లో మోసాలు చేస్తున్నా ఒక్కరోజైనా మంత్రి గంగుల కమలాకర్ కొనుగోలు కేంద్రాలను సందర్శించిన పాపానపోలేదని అన్నారు. మరో మంత్రి ఈటల రాజేందర్ హైదరాబాద్ కే పరిమితమయ్యారని […]

Read More

మిడతల దండును అడ్డుకుందాం

లేత పంటను పీల్చి పారేస్తుంది ప్రభావిత జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం కేసీఆర్​ సారథి న్యూస్​, హైదరాబాద్​: మిడతల దండు ప్రమాదం మరోసారి పొంచి ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. మిడతల దండు నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సూచించారు. గతనెలలో మూడు విడతలుగా దేశంలోకి ప్రవేశించిన మిడతల దండ్లు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వరకే వచ్చాయి. తెలంగాణ వైపునకు రాలేదు. అయితే […]

Read More

వైద్యసేవలు భేష్​

సారథి న్యూస్​, చొప్పదండి: కరీంనగర్​ జిల్లా చొప్పదండి పట్టణంలోని 6వ వార్డులో ఉన్న అంగన్​వాడీ సెంటర్​ను బుధవారం మున్సిపల్ చైర్ పర్సన్ గుర్రం నీరజ, కౌన్సిలర్ వడ్లూరి గంగరాజు తనిఖీచేశారు. పిల్లలు, గర్భిణులు, తల్లులకు అందుతున్న ఆహారం వివరాలను ఆరాతీశారు. కరోనా నేపథ్యంలో ప్రాణాలను చేయకుండా సేవలు అందిస్తున్న వైద్యసిబ్బందిని చైర్​పర్సన్​ అభినందించారు. పౌష్టికాహారం సక్రమంగా అందించాలని సూచించారు.

Read More

సింగరేణిలో కరోనా కలవరం

సారథి న్యూస్​, గోదావరిఖని: పట్టణంలోని సింగరేణి తరియా హాస్పిటల్ లో కరోనా కలవరం మొదలైంది. రెండు రోజుల క్రితం 8 ఇంక్లయిన్​ కాలనీకి చెందిన సింగరేణికి చెందిన ఓ కార్మికుడు మృతిచెందిన విషయం తెలిసిందే, కాగా, బుధవారం గోదావరిఖనికి చెందిన మరో సూపర్​వైజర్​ స్థాయి ఉద్యోగికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ప్రచారం జరగడంతో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కలవరం నెలకొంది. రెండురోజుల క్రితం సింగరేణి ఆస్పత్రిలో సదరు బాధితుడు అందరితో కలిసి తిరిగాడని అతని […]

Read More

భారత్​లో రికవరీ రేటు ఎక్కువే

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నదని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో… 1,35,206 మంది పూర్తిగా కోలుకున్నారని పేర్కొన్నది. మరో 1,33,632 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారని వైద్యశాఖ వెల్లడించింది. దాదాపు 48.99 శాతం మంది కోలుకుంటున్నట్టు వైద్యశాఖ గణాంకాల ద్వారా తెలుస్తున్నది. ఇది శుభపరిణామమే అయినప్పటికీ.. మనదేశంలో గత 24 గంటల్లో 9985 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది. ప్రస్తుతం దేశంలో మొత్తం కేసుల […]

Read More

రాజస్థాన్‌ సరిహద్దులు బంద్​

జైపూర్‌‌: కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో సరిహద్దులు మూసివేస్తూ రాజస్థాన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. వారం పాటు ఈ మూసివేత కొనసాగుతుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కేవలం పాస్​లు ఉన్నవారిని మాత్రమే ఇతర రాష్ట్రాలకు అనుమతించనున్నారు. నాన్‌ అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్వోసీ) లేనివారిని రాష్ట్రంలోని అనుమతించేంది లేదని డైరెక్టర్‌‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ ఎమ్‌ ఎల్‌ లాథర్‌‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని సరిహద్దుల వద్ద చెక్​పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. అంతే […]

Read More

జూడాలపై దాడులు సరికాదు

సారథి న్యూస్, ఆదిలాబాద్: కరోనా బాధితులకు వైద్యచికిత్సలు అందించే క్రమంలో హైదరాబాద్​లోని గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ పై దాడికి నిరసనగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉదయం గంటపాటు ఓపీ విధులను బహిష్కరించి ప్లకార్డులతో నిరసనకు దిగారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా రిమ్స్ ప్రధానగేటు వద్ద బైఠాయించారు. వారికి సీనియర్ డాక్టర్లు మద్దతు తెలిపారు. జూడాల సంఘం అధ్యక్షుడు ప్రణవ్ మాట్లాడుతూ కోవిడ్ […]

Read More

పేదలకు ‘జగనన్న చేదోడు’

సారథి న్యూస్​, శ్రీకాకుళం: నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపడానికే ‘జగనన్న చేదోడు’ కార్యక్రమం చేపట్టామని ఆంధ్రప్రదేశ్​ సీఎం వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి వివరించారు. బుధవారం వీడియోకాన్ఫరెన్స్​ ద్వారా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. టైలర్​ వృత్తిదారులు, నాయీ బ్రాహ్మణులు, రజకుల ఆర్థిక కష్టాలను పాదయాత్రలో తెలుసుకున్నానని వివరించారు. ప్రతి కుటుంబానికి రూ.10 వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అర్హులు ఏ ఒక్కరూ మిస్​ కాకూడదని సూచించారు. జూలై 8న ఇళ్లపట్టాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో స్పీకర్​ తమ్మినేని సీతారాం, మంత్రి […]

Read More