Breaking News

Day: June 7, 2020

ధోనీ లేకపోతే రివ్యూలు అంతే

న్యూఢిల్లీ: డీఆర్ఎస్​లను అంచనా వేయడంలో ధోనీని మించినోళ్లు లేరని మాజీ ప్లేయర్ వసీమ్ జాఫర్ అన్నాడు. ఒకవేళ ధోనీ సాయం లేకపోతే రివ్యూల్లో విరాట్ కోహ్లీ విజయవంతం కాలేడన్నాడు. ‘మహీ కీపర్ మాత్రమే కాదు. వికెట్ల వెనక ఉండి బంతిని చాలా నిశితంగా గమనిస్తాడు. బంతి గమనాన్ని అంచనా వేయడంలో చాలా నిష్ణాతుడు. అందుకే డీఆర్ఎస్ విషయంలో అంత కచ్చిమైన నిర్ణయాలు తీసుకుంటాడు. తన అంచనా కరెక్ట్ అని తేలితే ఒక్క క్షణం కూడా ఆలోచించడు. ఈ […]

Read More

జోర్డాన్ రూ.755 కోట్ల విరాళం

చార్లెట్: అమెరికా బాస్కెట్​బాల్​ దిగ్గజం మైకేల్ జోర్డాన్.. జాతి వివక్షపై పోరాడుతున్న వారికి అండగా నిలిచాడు. ఇందుకోసం కృషిచేస్తున్న సంస్థలకు తన వంతుసాయంగా రూ.755 కోట్లు విరాళంగా ప్రకటించాడు. నైకీ సంస్థ రూపొందించిన జోర్డాన్ బ్రాండ్ తరఫున రూ.302 కోట్లు ఇవ్వనున్నాడు. ‘వివక్ష లేకుండా జాతి సమానత్వం, సామాజిక న్యాయం, విద్యా లక్ష్యాలను చేరుకోవడానికి నా వంతు సాయం అందిస్తున్నా. పదేళ్ల నుంచి ఇది కొనసాగుతూనే ఉంది. మున్ముందు కూడా కొనసాగుతుంది. నల్లజాతీయులకు వాళ్ల కూడా ప్రాణాలు […]

Read More

కరోనాతో మాజీ ఫుట్​బాలర్​ మృతి

కొజికోడ్: రోజురోజుకూ విజృంభిస్తున్న కరోనా దెబ్బకు.. భారత మాజీ ఫుట్​బాల్​ ప్లేయర్​ హమ్జాకోయ మృత్యువాతపడ్డాడు. గతనెల 26న కరోనా లక్షణాలు కనిపించడంతో మల్లాపురంలోని మంజేరి మెడికల్ కాలేజీ హాస్పిటల్​లో చేరాడు. రెండు రోజుల తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో డాక్టర్లు వెంటిలేటర్​పై ఉంచి చికిత్స ఇచ్చారు. అయితే కరోనా నుంచి కోలుకోలేకపోయిన హమ్జా శనివారం తుదిశ్వాస విడిచాడు. హమ్జా కుటుంబసభ్యుల్లో కూడా ఐదుగురికి పాజిటివ్ అని తేలడంతో చికిత్స అందిస్తున్నారు. గతనెల 21న ముంబై నుంచి […]

Read More

బీబీసీకి బాయ్​కాట్​ గుడ్​ బై

లండన్: వ్యాఖ్యాతగా.. బీబీసీతో ఉన్న అనుబంధాన్ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జెఫ్రీ బాయ్​కాట్​ తెంచుకున్నాడు. 14 ఏళ్లుగా కొనసాగిస్తున్న సేవల నుంచి విరమించుకున్నాడు. ‘బీబీసీకి ప్రత్యేకమైన వ్యాఖ్యాతల బృందం ఉంటుంది. అందులో నుంచి నేను వైదొలుగుతున్నా. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేను ఈ బాధ్యతల్లో కొనసాగలేను. నా ఆరోగ్యం గురించి కూడా ఆలోచించుకోచాలి. కరోనా కారణంగానే నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నా. మొన్న గుండెకు శస్త్రచికిత్స కూడా చేయించుకున్నా. కాబట్టి ఒత్తిడితో కూడిన పనులు చేయొద్దనుకుంటున్నా’ అని […]

Read More

తొలి టెస్టు​కు రూట్ అనుమానమే

లండన్: వెస్టిండీస్​తో జరిగే తొలి టెస్ట్​కు ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ అందుబాటులో ఉండడంపై సందిగ్దం నెలకొంది. జులై 8 నుంచి 12వ తేదీ వరకు ఈ మ్యాచ్ జరగనుంది. అదే సమయంలో రూట్ భార్య రెండో బిడ్డకు జన్మనిచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో డెలివరీ సమయంలో భార్య వద్ద ఉండాలనే అభిప్రాయంతో రూట్ ఉన్నాడు. దీనికోసం అతను సెలవు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇది పూర్తయిన తర్వాత రూట్ టీమ్​తో చేరాలంటే క్వారంటైన్ నిబంధనలు […]

Read More

కెప్టెన్సీ బాధ్యతలు పంచుకోవాలి

ముంబై: క్రికెట్ షెడ్యూల్ బిజీగా ఉంటున్న నేపథ్యంలో.. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మతో కలిసి పంచుకోవాలని భారత మాజీవికెట్ కీపర్ కిరణ్ మోరె అన్నాడు. ఏడాది మొత్తం ఒకరే నాయకుడిగా వ్యవహరించడంతో బరువు పెరుగుతుందన్నాడు. ఒక జట్టు.. ఇద్దరు సారథుల అంశంపై మోరె మాట్లాడుతూ.. ‘బీసీసీఐ ఈ అంశంపై దృష్టిపెట్టాలి. టీమిండియా అన్ని ఫార్మాట్లతో కలిపి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కూడా కోహ్లీయే కెప్టెన్​గా ఉన్నాడు. తద్వారా ఒత్తిడి, బాధ్యతలు పెరిగిపోతున్నాయి. ఇది కొనసాగడం […]

Read More

నల్లజాతీయుల ప్రాణాలూ ముఖ్యమే

న్యూఢిల్లీ: జాతి వివక్షపై క్రీడాకారుల గళం రోజురోజుకు పెరుగుతోంది. భిన్నత్వం లేకుంటే క్రికెట్ లేదంటూ ఐసీసీ చేసిన ట్వీట్​కు బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మద్దతిచ్చాడు. ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి ఆటకు ఉందని కితాబిచ్చాడు. అఫ్రో అమెరికన్ జార్జిఫ్లాయిడ్ మృతిపై చెలరేగుతున్న నిరసనలు, నల్లజాతీయుల ప్రాణాలు ముఖ్యమేనని కొనసాగుతున్న ఉద్యమానికి కూడా మాస్టర్ అండగా నిలిచాడు. ‘ఓసారి నెల్సన్ మండేలా.. ప్రపంచాన్ని మార్చే శక్తి ఆటకు ఉంది. మరెవరికీ సాధ్యంకాని రీతిలో అది ప్రపంచాన్ని ఏకీకృతం […]

Read More

మోగనున్న గుడిగంట

సారథి న్యూస్, శ్రీకాకుళం, విజయనగరం: కరోనా వ్యాప్తి నేపథ్యంలో రెండున్నర నెలల తర్వాత గుడి తలుపులు తెరుచుకోనున్నాయి.. రెండురోజుల పాటు ప్రయోగాత్మకంగా ఏర్పాట్లను పరిశీలించిన తర్వాత, ఆధార్​, సెల్​ నంబర్​ తదితర వివరాలను పరిశీలించి భక్తులను అనుమతించనున్నారు.. దేవాదాయశాఖ శ్రీకాకుళం జిల్లా సహాయ కమిషనర్​ వై.భద్రాజీ శనివారం మార్గదర్శకాలు జారీచేశారు. భక్తులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ టెస్ట్​లు చేయాలని సూచించారు. భక్తులు కాళ్లు, చేతులు కడుక్కోవడానికి బక్కెట్లతో నీళ్లు, మగ్గులు, శానిటైజర్లను అందుబాటులో ఉంచుతారు. జూన్​ 8, 9వ […]

Read More