Breaking News

Day: June 7, 2020

జిమ్ సెంటర్లకు అనుమతివ్వండి

సారథి న్యూస్​, ఎల్బీనగర్: లాక్ డౌన్ సందర్భంగా తెలంగాణలో జిమ్ సెంటర్ల నిర్వహణను పునరుద్ధరించాలని ఎల్బీనగర్ నియోజకవర్గంలోని జిమ్ ఓనర్ల అసోసియేషన్ సభ్యులు ఆదివారం అడాల యాదగిరి, అడాల శ్రీను ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. లాక్ డౌన్ సమయంలో ప్రతినెలా జిమ్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు, మెయింటనెన్స్, ఎక్యూప్మెంట్ ఈఎంఐలు, కరెంట్ బిల్లులు, ఏసీ బిల్లులు కలుపుకోని రూ.లక్షల్లో చెల్లించాల్సి వస్తుందన్నారు. జిమ్ సెంటర్లు బంద్ చేసినప్పటికీ ఉద్యోగులకు తప్పకుండా వేతనాలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. […]

Read More

టెన్త్​… టెన్షన్​

సారథి న్యూస్​, హైదరాబాద్: తెలంగాణలో వాయిదాపడి టెన్త్​ క్లాస్​ ఎగ్జామ్స్​ భవితవ్యం ఏమిటో తేలనుంది.. మరోసారి వాయిదాపడిన నేపథ్యంలో అటు స్టూడెంట్స్​.. ఇటు పేరెంట్స్​లో ఆందోళన నెలకొంది. పరీక్షల నిర్వహణపై సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, లాక్‌డౌన్‌ అంశాలపై సోమవారం సాయంత్రం 4.30 గంటలకు సీఎం సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మరోసారి వాయిదాపడ్డాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కరోనా […]

Read More

మనోజ్​ మరణం కలచివేసింది

సారథి న్యూస్​, హైదరాబాద్​: కరోనా(కోవిడ్ –19)తో జర్నలిస్ట్ మనోజ్ కుమార్​ మృతిచెందడం బాధాకరమని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఆదివారం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మనోజ్ కుమార్​ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కరోనా బారినపడి ఓ తెలుగు జర్నలిస్ట్ మృత్యువాతపడడం ఎంతో కలచి వేసిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మినహా మరో మార్గం లేనందున జర్నలిస్టులు ఎక్కువ […]

Read More

పట్టణప్రగతిలో భాగస్వాములు కండి

సారథి న్యూస్​, రంగారెడ్డి: గ్రామాలతో పాటు పట్టణాలను అభివృద్ధి చేయాలన్నదే సీఎం కేసీఆర్‌ సంకల్పమని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో కాలనీ వాసులు భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని నాదర్‌గుల్‌ 8వ వార్డులో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు, అల్మాస్‌గూడ జయశంకర్‌ కాలనీలో రూ.47లక్షలతో డ్రైనేజీ పైపులైన్‌, నవయుగ కాలనీలో రూ.15 లక్షలతో డ్రైనేజీ, సాయినగర్‌ కాలనీలో రూ.30 లక్షలతో సీసీ రోడ్డు పనులకు ఆదివారం మంత్రి […]

Read More

పట్టణాల పారిశుద్ధ్యమే ముఖ్యం

సారథి న్యూస్​, రామగుండం: పట్టణాల పారిశుద్ధ్యమే ముఖ్యమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆదివారం ఆయన రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 30వ డివిజన్ లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రధాన కాల్వల క్లీనింగ్​ను పరిశీలించారు. వర్షాకాలంలో సీజనల్ వాధ్యులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఆయన వెంట రామగుండం కార్పొరేషన్​ మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, నారాయణదాసు, మారుతి, ఇరుగురాళ్ల శ్రావణ్, బూరుగు వంశీకృష్ణ, […]

Read More
షార్ట్ న్యూస్

ప్రైవేటీకరణను వ్యతిరేకించండి

సారథి న్యూస్​, గోదావరిఖని: బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 10, 11 తేదీల్లో బొగ్గు గనుల వద్ద జరిగే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరుతూ ఆదివారం గోదావరిఖని గాంధీనగర్​లోని ఐఎఫ్ టీయూ ఆఫీసులో విప్లవ కార్మిక సంఘాల జేఏసీ సమావేశం నిర్వహించారు.

Read More

మృగశిర సందడి షురూ

సారథి న్యూస్, రామాయంపేట: మృగశిర ముందు రోజే ఆదివారం చేపలను చాలామంది కొనుగోలు చేశారు. మృగశిర అనగానే గుర్తుకొచ్చేది ఆ రోజున చేపలు తినడం.. సోమవారం మృగశిర కార్తె రానుంది. దీని వెనక రకరకాల కారణాలు ఉన్నాయి. మొదటి రోజును దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మృగశిర, మృగం, మిరుగు, మిర్గం పేర్లతో పిలుస్తారు. ఈ కార్తె ప్రారంభమైందంటే ఎండాకాలం మండే ఎండలు పోయి వర్షాకాలం షురూ అయినట్లు లెక్క. వరుణుడి పలకరింపుతో పొంగిపొర్లే నీటికి చెరువుల్లో ఎగిసిపడే […]

Read More

పేద విద్యార్థికి ఎమ్మెల్యే సాయం

సారథి న్యూస్​, బిజినేపల్లి: ఓ పేదింటి విద్యాకుసుమానికి నాగర్​ కర్నూల్​ ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి ఆదివారం హైదరాబాద్​లోని తన నివాసంలో రూ.50వేల ఆర్థిక సాయం అందజేశారు. బిజినేపల్లి మండలంలోని ఉడుగులకుంట తండా గ్రామనికి చెందిన సురేష్ కు ఒడిశాలోని సాంబల్​పూర్​ ఐఐఎంలో ఎంబీఏ సీటు వచ్చింది. చదవడానికి డబ్బులు లేకపోవడంతో ఇబ్బందిపడుతున్నాడు. తల్లిదండ్రులు, స్థానిక నాయకులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన ఎమ్మెల్యే తనవంతు సాయం చేశారు. ఆయన వెంట జడ్పీటీసీ హరిచరణ్ రెడ్డి, […]

Read More