భారత హాకీ జట్ల ప్లేయర్ల ఆరోగ్యంపై ఆందోళన న్యూఢిల్లీ: బెంగళూరులోని సాయ్ సెంటర్ లో పనిచేస్తున్న కుక్ (వంట మనిషి)కి కరోనా వైరస్ ప్రబలింది. దీంతో ఇటీవల గుండెపోటుకు గురైన ప్రాణాలు కోల్పోయాడు. మరణాంతరం కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌గా తేలింది. దీంతో సాయ్ సెంటర్ లో ఉన్న భారత హాకీ జట్ల ప్లేయర్ల ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది. అయితే చనిపోయిన కుక్.. ప్లేయర్లు ఉన్న ప్రాంతంలోకి ఒక్కసారి కూడా వెళ్లలేదని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. […]
మెల్బోర్న్: క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఉపయోగించే బంతులనూ క్రిమిరహితం చేయాలని క్రికెట్ ఆస్ర్టేలియా (సీఏ) స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు అలెక్స్ కౌంటారిస్ అన్నాడు. తద్వారా క్రికెటర్ల హెల్త్ రిస్క్ మరింత తగ్గుతుందన్నాడు. వైరస్ నాశనం కోసం వాడే మందులకు ఐసీసీ నుంచి అనుమతి తీసుకోవాలని సూచించాడు. ప్రస్తుతానికి తాము వీటిపై పరీక్షలు జరుపుతున్నామని, ఎంత మేరకు ప్రభావం చూపుతుందో తెలుస్తుందన్నాడు. క్రికెట్ ను సురక్షితంగా మొదలుపెట్టేందుకు తాను మార్గదర్శకాలను రూపొందిస్తున్నానని చెప్పాడు. ‘ప్రస్తుతం ఇంగ్లండ్ కూడా చాలా […]
ఇంటికే పరిమితమైన ముంబై క్రికెటర్లు ముంబై: దేశవ్యాప్తంగా స్టేడియాలు తెరిచేందుకు అనుమతి ఇవ్వడంతో చాలామంది క్రీడాకారులు ఔట్ బోర్ లో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. కానీ ముంబై క్రికెటర్లు రహానె, రోహిత్, పృథ్వీ మాత్రం ఇంకా ఇంటికే పరిమితమయ్యారు. ప్రాక్టీస్ చేసేందుకు వీళ్లు మరికొంతకాలం వేచి చూడక తప్పేలా లేదు. ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉండడంతో ముంబై మొత్తాన్ని మహారాష్ట్ర గవర్నమెంట్ రెడ్ జోన్‌గా ప్రకటించింది. దీంతో స్థానికంగా ఉడే వాంఖడే, బాంద్రాకుర్లా, సచిన్ టెండూల్కర్ […]
టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ న్యూఢిల్లీ: టీ20లకు ప్రత్యేకంగా బ్యాటింగ్ కోచ్ ఉండడం సరైందేనని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఇందుకోసం అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉండాల్సిన అవసరం లేదన్నాడు. ‘స్పెషలిస్ట్ కోచ్‌తో చాలా ప్రయోజనాలు ఉంటాయి. కోచ్‌గా సక్సెస్ కావాలంటే ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉండాలన్నది సరైన వాదన కాదు. టీ20ల్లో కోచ్ చేయాల్సింది.. ప్లేయర్లలో సానుకూల ధోరణిని పెంచడం. భారీ షాట్స్ ఆడేలా, లక్ష్యాలు చేరుకునేలా […]
బీసీసీఐ నిర్ణయం న్యూఢిల్లీ: కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ వో)ను ఇప్పుడే నియమించలేమని బీసీసీఐ సంకేతాలిచ్చింది. భారీవేతనం ఇవ్వాల్సి ఉండడంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో బోర్డు దానిని భరించలేదన్ని వెల్లడించింది. గతంలో సీఎఫ్‌వోగా పనిచేసిన సంతోష్ రంగ్నేకర్.. వ్యక్తిగత కారణాలతో ఆరుక్రితం రాజీనామా చేశాడు. అప్పట్నించి ఈ పోస్ట్ ఖాళీగా ఉంది. ‘సీఎఫ్‌వోను ఇప్పుడు నియమించలేం. కొత్త రాజ్యాంగం ప్రకారం కూడా ఇదేమీ తప్పనిసరికాదు. బోర్డుకు కచ్చితంగా సీఈవో ఉండాలన్నది నిబంధన. సీఎఫ్‌వో ఉండాల్సిన అవసరం ఉందని […]
బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మెంబర్ అన్షుమన్ గైక్వాడ్ న్యూఢిల్లీ: ఇప్పుడున్న పరిస్థితులు ఇలాగే కొనసాగితే టీ20 ప్రపంచకప్ జరగడం అనుమానమేనని బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మెంబర్ అన్షుమన్ గైక్వాడ్ అన్నాడు. ఈనెల 28న ఐసీసీ సమావేశంలో దీనిపై ఎలాంటి నిర్ణయం వస్తుందో చూడాలన్నాడు. ఒకవేళ ఏవైనా కారణాలతో మెగా ఈవెంట్ వాయిదా పడితే.. ఐపీఎల్ కు మార్గం సుగమమవుతుందన్నాడు. ‘ఐపీఎల్‌కు విండో దొరికినా.. అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేం. ఐపీఎల్ భవిష్యత్ అప్పుడే తేలుతుంది. […]
ఏపీలో ఆర్టీసీ బస్సులు ప్రారంభం సిటీ సర్వీసులకు అనుమతి లేదు నగదురహిత టికెట్ లు జారీ సారథి న్యూస్, అనంతపురం, శ్రీకాకుళం: కరోనా వ్యాప్తి.. లాక్ డౌన్ నేపథ్యంలో డిపోలకే పరిమితమైన ఏపీఎస్ఆర్టీసీ బస్సులు 58 రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో గురువారం ఉదయం ఎట్టకేలకు రోడ్డెక్కాయి. ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలను సడలించడంతో విజయవాడ, విశాఖ సిటీ సర్వీసులు మినహా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్ సర్వీసులు రాకపోకలు సాగించాయి. ఆన్‌లైన్ బుకింగ్ కూడా బుధవారం సాయంత్రం నుంచే […]
70 శాతం సర్వీసులు మాత్రమే: ఏపీఎస్ఆర్టీసీ ఎండీ సారథి న్యూస్, విజయవాడ: గురువారం ఉదయం 7 గంటల నుంచి బస్సు సర్వీసులను ప్రారంభిస్తున్నామని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ తెలిపారు. నెమ్మదిగా సంస్థ ఆర్థిక వృద్ధిని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం మీడియాకు వెల్లడించారు. సిటీ బస్సు సర్వీసులను తర్వాత ప్రారంభిస్తామన్నారు. కరోనా వ్యాప్తి.. లాక్ డౌన్ నేపథ్యంలో సమారు రెండు నెలలుగా ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర […]