సారథి న్యూస్, హైదరాబాద్: నగర నడిబొడ్డున పంజాగుట్టలో రూ.23కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన స్టీల్ బ్రిడ్జి, రోడ్డు విస్తరణ పనులను వేగంగా పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్ట్ సంస్థను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఆదివారం నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మున్సిపల్శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ తో కలిసి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. లాక్డౌన్ తో కలిగిన వెసులుబాటుతో అదనంగా కార్మికులు, నిపుణులను నియమించి రేయింబవళ్లు పనులు చేయిస్తున్న కాంట్రాక్టర్ను […]
* కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు* కంటైన్‌మెంట్ క్లస్టర్లపై స్పెషల్ ఫోకస్* ప్రతిరోజూ 25వేల మందికి ఆహార ప్యాకెట్లు* జీహెచ్‌ఎంసీ, పోలీసుశాఖకు సహకరించండి* ‘సారథి ప్రతినిధి’తో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ ‘కరోనా(కోవిడ్ 19) వ్యాప్తి నివారణకు బల్దియా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి క్వారంటైన్ సెంటర్లకు పంపించాం. కరోనా పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా నివారణ చర్యలు తీసుకుంటున్నాం. మర్కజ్ వెళ్లొచ్చిన వారిని గుర్తించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించారు. […]
సారథి న్యూస్, మెదక్: యాసంగి సీజన్ లో సాగు చేసిన వరి పంట దిగుబడులు చేతికి అందుతున్న తరుణంలో అకాలవర్షాలు అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈదురుగాలులకు తోడు వడగళ్లు కురుస్తుండడంతో కోతకు సిద్ధంగా ఉన్న వరి పైర్లు దెబ్బతింటున్నాయి. వడ్లు రాలి నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఉదయం శివ్వంపేట , చిలప్ చెడ్, కొల్చారం, మెదక్, రామాయంపేట, నిజాంపేట్, చిన్న శంకరంపేట మండలాల్లో భారీ వర్షం కురిసింది. అగ్రికల్చర్ ఆఫీసర్లు అందించిన ప్రాథమిక […]
జేజమ్మ అనుష్క వివాహం గురించి ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. యంగ్ రెబల్ బ్యూటీ స్టార్ పెళ్లిపీటలు ఎక్కనుందని ఆమధ్య వార్తలు వచ్చాయి. వాటిని వారిద్దరూ ఖండించారు. ఆ తర్వాత ఉత్తరాదికి చెందిన ఓ క్రికెటర్‌తో అనుష్క ప్రేమయాణం సాగిస్తోందని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ వచ్చింది. ఆ టాక్‌ను కూడా అనుష్క స్వయంగా ఖండించింది. అనుష్క పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఇతనేనంటూ తాజాగా మరో పేరు తెరమీదకు వచ్చింది. టాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ దర్శకుడి […]
నవ చైతన్యానికీ విశ్వ సౌందర్యానికి ప్రతీక ఉగాది. నిరాశల ఎండుటాకులను నిర్మూలించి, కొత్త ఆశల చిగుళ్లను ఆఆవిష్కరించే వసంతమే ఉడాది. తెలుగువారి తొలి పండుగ ఇది. అయితే యుగాది అనే సంస్కృత పదం క్రమేణా ఉగాదిగా రూపాంతరం చెందింది. శకయుగం ప్రారంభమైంది ఈరోజు నుంచే కావునా యుగాది అయిందని చెబుతుంటారు. అందుకే తెలుగు వారికి ఇది తొలి పండుగ అయింది. చంద్రమాన పంచాంగం ప్రకారం మొదటి నెల చైత్రమాసం. చైత్రమాసం మొదటి రోజైన చైత్ర శుద్ధ పాఢ్యమి […]
సారథి న్యూస్, నల్లగొండ: నల్లగొండలో మహిళకు పాజిటివ్ నిర్ధారణ సూర్యాపేట లింక్‌తో వచ్చినట్లు భావిస్తున్న అధికారులు నల్లగొండ జిల్లాలో కరోనా వైరస్‌ను కట్టడి చేశామన్న ఆనందంలో అధికార యంత్రాంగం ఉంది. ఇక కొత్త కేసులు లేవని సంతోషపడ్డారు. 12 రోజులపాటు 300 పైచిలుకు అనుమానితుల శాంపిల్స్ పరీక్షలకు పంపారు. అందరికీ నెగిటివ్ వచ్చింది. ఇప్పటికే నమోదైన 12 కేసుల్లో ఆరుగురు గాంధీ ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి కూడా వచ్చారు. ఇక ఉన్నవి ఆరు కేసులు మాత్రమే […]
మే 3వ తేదీ తర్వాత లాక్ డౌన్ ను మరోమారు పొడిగించక పోవచ్చన్న సంకేతాలు అందడంతో శనివారం నుంచి విమాన ప్రయాణాలకు టికెట్ల బుకింగ్ మొదలయ్యాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పరిస్థితులు చక్కబడితే 4వ తేదీ నుంచి దేశీయ ఎయిర్ పోర్టుల నుంచి విమానాలు బయలుదేరుతాయని దాదాపు అన్ని పౌర విమానయాన సంస్థలూ ప్రకటించాయి. ప్రభుత్వ రంగ ఎయిర్ ఇండియా మాత్రం, తాము ఎంపికచేసిన రూట్లలోనే పరిమితంగా సర్వీసులు నిర్వహిస్తామని పేర్కొంది. విదేశీ సర్వీసులు కూడా నడుపుతామని, […]