Breaking News

శార్వరి.. శుభకరి

ఇంటింటా ఉశస్సులు నింపే ఉగాది రైతులు జరుకునే ప్రకృతి పండుగ జీవిత పరమార్థం చెప్పే షడ్రుచులు
ఇంటింటా ఉశస్సులు నింపే ఉగాది – రైతులు జరుకునే ప్రకృతి పండుగ
– జీవిత పరమార్థం చెప్పే షడ్రుచులు

నవ చైతన్యానికీ విశ్వ సౌందర్యానికి ప్రతీక ఉగాది. నిరాశల ఎండుటాకులను నిర్మూలించి, కొత్త ఆశల చిగుళ్లను ఆఆవిష్కరించే వసంతమే ఉడాది. తెలుగువారి తొలి పండుగ ఇది. అయితే యుగాది అనే సంస్కృత పదం క్రమేణా ఉగాదిగా రూపాంతరం చెందింది. శకయుగం ప్రారంభమైంది ఈరోజు నుంచే కావునా యుగాది అయిందని చెబుతుంటారు. అందుకే తెలుగు వారికి ఇది తొలి పండుగ అయింది. చంద్రమాన పంచాంగం ప్రకారం మొదటి నెల చైత్రమాసం. చైత్రమాసం మొదటి రోజైన చైత్ర శుద్ధ  పాఢ్యమి రోజున ఈ పండుగను  జరుపుకుంటారు. ఉగాది ప్రకృతి పండుగ. మానవ మనుగడకు వ్యవసాయమే పరమావధి. రైతులు, వ్యవసాయదారులు చేసుకునే నిజమైన ప్రకృతి పర్వదినం ఇది. ఉగాది వచ్చిందంటే చెట్టూ చేమ గొడ్డూ గోదా నవశోభను సంతరించుకుంటాయి. జీవితం పరమార్థాన్ని చెప్పుకునే పండుగ ఇది. ప్రకృతిని ఆరాధించడం ఈ పండుగలో మాత్రమే మనకు కనిపిస్తుంది. శిశిర రుతువులో చెట్ల ఆకులు రాలుతాయి. వసంత రుతువులో అంటే ఉగాది రాగానే కొత్త చిగురుటాకులతో నవయవ్వన శోభను సంతరించుకుంటాయి. ఈ పండుగ వసంత సుందరిని మన ముంగిళ్లకు ఆహ్వానించి చరిత్రలక్ష్మీ అనే సంపదను అందిస్తుందని పెద్దలు చెబుతుంటారు. ఉగాది రోజు తెలుగు ప్రాంతాలు వేదపండితుల పంచాంగ శ్రవణాల కోసం ఒకచోటుకి చేరుకుంటాయి.ఉగాది ఎలా వచ్చింది..?వేదాలను దొంగిలించిన సోమకాసురుడు అనే రాక్షసుడిని విష్ణుమూర్తి సంహరించి వాటిని బ్రహ్మదేవుడికి అప్పగించిన రోజే ఈ ఉగాది అని వేదాలు, పురాణాల్లో పేర్కొన్నారు. ఈ తరుణాన బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించారని ఈ కథ ద్వారా తెలియజేస్తుంది. సృష్టి ప్రారంభమైన రోజునే ప్రతి ఏడాది కొత్త సంవత్సరం పండుగలా జరుపుకోవాలని ఇప్పటికీ ఆచరణీయంగా వస్తోంది. ఉగాది రోజున సృష్టి మొదలైనట్లు మరో గాధ జనబాహుళ్యంలో ప్రచారంలో ఉంది. జడంగా ఉన్న జగత్తులో చైతన్యాన్ని రగిలించే మానవత్వానికి కొత్త ఆశలు, ఆశయాలను రేకెత్తించిన రోజుగా ఉగాదిని పేర్కొనవచ్చు. పంచాంగ శ్రవణం విశిష్టతతిథి, వార, నక్షత్ర, యోగ, కరణం..ఐదింటినీ కలిపి పంచాంగాలు అని చెబుతారు. ఇందులో తిథి శ్రేయస్సును, వారం ఆయుష్షును నక్షత్రం పాపాలను హరిస్తుందని, యోగంలో రోగాలను నివారణ చేస్తోందని, కరణం కార్యసిద్ధికి సహకరిస్తుందని తెలియజేసే పంచాంగాలు. అందుకే ఈ ఐదింటి సమాహారమే పంచాగం.. ఉగాది పర్వదినం రోజున పంచాంగ శ్రవణం చేయడం ఆనాదిగా వస్తున్న సనాతన ఆచారం. ఈ ఉగాది నుంచి మళ్లీ ఉగాది దాకా రాజ్యాధిపతి సస్యకారకుడు మొదలగు నవనాయకులు ఎవరెవరు ఏయే ఆధిపత్యం వహిస్తారు.. వారి ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు తెలుగు రాష్ట్ర ప్రజలు ఉవ్విళ్లూరుతుంటారు. అందుకే అన్ని ప్రాంతాల్లో ఆలయాల్లో రచ్చబండలు ఊరి వాకిళ్లలో ఈ పంచాంగ శ్రవణాలు ఏర్పాటు చేస్తుంటారు. వ్యక్తి ఆదాయం నుంచి ఖర్చు తీసివేస్తే నికరమైన పొదుపు అదే ఆదాయ వ్యయాలు. అలాగే రాజ్యపూజ్యం నుంచి అవమానాలను తీసేస్తే వచ్చేదే నిజమైన కీర్తి ప్రఖ్యాతలు. ఈ రెండు ప్రతి మనిషికి వస్తాయనేది సత్యం. ఈ రెండింటిని పంచాంగాల్లో రాజపూజ్య అవమానాలు అని చెబుతుంటారు. పంచాంగం తెలుసుకోవడం అంటే భవిష్యత్‌‌ను ప్రణాళిక వేసుకోవడమే.షడ్రుచుల మేళవింపుఉగాది రోజు ప్రజలు ఉదయాన్నే తలంటు స్నానాలు చేసి కొత్త దుస్తులు ధరించి సమీప ఆలయాల్లో పూజలు నిర్వహించి పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంటారు. అలాగే ఆరోజు తెలుగునాట ప్రతి ఇంటా వసంతలక్ష్మి రాకకు సంకేతాలుగా పచ్చని మామిడి తోరణాలు ఇంటికి అలంకరిస్తారు. ఉగాది నాడు చేసుకునే పచ్చడి ఎంతో ప్రాముఖ్యమైంది. షడ్రుచుల పచ్చడిని ఆరగించడం వెనుక జీవితసారం గోచరిస్తుంది. ఈ పచ్చడిలో మధురం(తీపి), ఆమ్లం(పులుపు), కటు(కారం), కషాయ(వగరు), లవణం(ఉప్పు), తిక్త(చేదు)రుచులు మిళితమై ఉంటాయి. ఇందులో కొత్త బెల్లం ఆకలిని కలిగిస్తుంది. చింతపండు కఫ వాతాల్ని పోగొడుతుంది. మిరియాల పొడి శరీరంలో క్రిములను నాశనం చేస్తుంది. మామిడి ముక్క జీర్ణ ప్రక్రియకు తోడ్పడుతుంది. వేప పువ్వు చేసే మేలు పలు విధాలుగా ఉంటుంది.జీవిత పరమార్థంఈ రుచులు మన జీవితంలో ఎదురయ్యే మంచి చెడులను కష్టసుఖాలను ఆనంద విషాదాలు సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఇచ్చేదే ఉగాది పచ్చడిలోని పరమార్థం. బెల్లం తీపి ఆనందానికి సంకేతం. ఉప్పు జీవితంలో ఉత్సాహానికి రుచికి సంకేతం, వేపపువ్వు జీవితంలో ఎదురయ్యే చేదు బాధ కలిగించే అనుభవాలు. చింతపండులోని పులుపు నేర్పుగా వ్యవహరించాలని చెబుతుంది. పచ్చిమామిడి ముక్కల పులుపు కొత్త సవాళ్లను, కారం సహనం కోల్పోయే పరిస్థితులకు సంకేతంగా చెప్పొచ్చు. ఇలా జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను అన్నింటినీ సమపాళ్లలో తీసుకోగలిగే ఆ జీవితం సుఖంగా నిత్యం ఆరోగ్యంగా ఉంటుందని దీని పరమార్థం. ఆరురుచులు ఉగాది పచ్చడిలోనే కాదు.. జీవితాన్ని మంచి చెడుల సంగమంగా స్వీకరించేందుకు అవగాహన కల్పించడానికి మన పూర్వీకులు పంచాంగ శ్రవణం ఏర్పాటుచేశారు. ఇది రైతుల పండుగతెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో బొబ్బట్లు, పూర్ణం బూరెలు విధిగా చేస్తారు. ఈ రెండు వంటకాలు తెలుగు ప్రజల పూజల్లో ప్రత్యేక వంటకాలుగా నిలుస్తాయి. ఈ రెండింటినీ తాజా ఆవు నెయ్యిని జోడించి ఆరగిస్తారు. అయితే తెలుగు వారే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ వివిధ పేర్లతో జరుపుకుంటారు, మహారాష్ట్రలో గుడిపాడ్వా, తమిళనాడులో పుత్తాండు, సిక్కులు వైశాఖీ, బెంగాలీలు పొయ్‌‌లా బైశాఖ్‌‌పేరుతో వేడుకను జరుపుకుంటారు. ఎవరు ఏ పేరిట జరిపినా ఇది నిజమైన రైతుల పండుగ. అలాగే ఈ రోజు రైతులు తమ నిజమైన నేస్తాలు ఎద్దులను ముస్తాబు చేసి నాగలిని పూజించి నేరుగా పొలానికి వెళ్లి తూర్పు పడమర సాళ్లను దున్ని పచ్చడి బంగారు పంట పండించేందుకు వ్యవసాయాన్ని ప్రారంభిస్తారు.-దిండిగల్‌‌ఆనంద్ శర్మ, అలంపూర్‌‌జోగుళాంబ ఆలయ ముఖ్యఅర్చకులు, సెల్‌‌నం.9666006418